వందమంది మహిళా ఎమ్మెల్యేలు ఒకే చోట

మహిళా సాధికారిత ఏంటో చాటిచెప్పే అరుదైన సన్నివేశం తొందరలోనే విశాఖలో ఆవిష్కృతం కాబోతోంది. విశాఖ వేదికగా ఫిబ్రవరి 4, 5, 6 తేదీలలో మూడు రోజుల పాటు మహిళా ఎమ్మెల్యేల సదస్సుని నిర్వహించనున్నారు. ఈ…

మహిళా సాధికారిత ఏంటో చాటిచెప్పే అరుదైన సన్నివేశం తొందరలోనే విశాఖలో ఆవిష్కృతం కాబోతోంది. విశాఖ వేదికగా ఫిబ్రవరి 4, 5, 6 తేదీలలో మూడు రోజుల పాటు మహిళా ఎమ్మెల్యేల సదస్సుని నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి అనేక రాష్ట్రాలకు చెందిన దాదాపు వంద మంది మహిళా ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలుస్తోంది.

ప్రతిష్టాత్మకమైన మహిళా ఎమ్మెల్యేల సదస్సుని ఉత్తరఖండ్ ముస్సోరీలోని నేషనల్ జెండర్ అండ్ చైల్డ్ సెంటర్, లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్నారు. జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ ఫర్ ఎలెక్టెడ్ విమెన్ రిప్రజెంటేటివ్స్ నినాదంతో ఈ సదస్సుని నిర్వహిస్తున్నారు.

ఈ సదస్సు విశాఖలో నిర్వహించడం ద్వారా ఈ నగర ఖ్యాతిని జాతీయ సమాజానికి తెలియచేయడానికి ఒక గెల్డెన్ చాన్స్ ఇచ్చారని అధికారులు అంటున్నారు. మొత్తం మహిళా ప్రజా ప్రతినిధులు అంతా ఒక్క చోట చేరి చేసే తీర్మానాలు కానీ వారి ఆలోచనలు కానీ యావత్తు దేశం విశాఖ ద్వారా వినబోతోంది. 

ఈ సదస్సు మహిళా సాధికారితకు అతి పెద్ద ఉదాహరణగా మారబోతోంది అని అంటున్నారు. సాగర నగరాన ఆకాశంలో సగం అయిన మహిళా ఏలికలు ఎలుగెత్తి సత్తా  చాటబోతున్నారు అన్న మాట.