కీర్తి సురేష్ సూపర్ !

మంచి మనసున్న హీరోయిన్లు అరుదుగా వుంటారు. నిర్మాత దగ్గర నుంచి ఎంత తీసుకుందామనే తప్ప, తను పని చేసిన సినిమా యూనిట్ సభ్యులకు ఏదైనా ఇవ్వాలని అనుకోవడం కూడా అరుదుగానే వుంటుంది. ‘మహానటి’ అనిపించుకున్న…

మంచి మనసున్న హీరోయిన్లు అరుదుగా వుంటారు. నిర్మాత దగ్గర నుంచి ఎంత తీసుకుందామనే తప్ప, తను పని చేసిన సినిమా యూనిట్ సభ్యులకు ఏదైనా ఇవ్వాలని అనుకోవడం కూడా అరుదుగానే వుంటుంది. ‘మహానటి’ అనిపించుకున్న కీర్తి సురేష్ మాత్రం ఈ విషయంలో తను మినహాయింపు. ప్రస్తుతం ఆమె నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో నటిస్తోంది. సుధాకర్ నిర్మాత. ఈ సినిమా షూట్ ఈ రోజు ముగిసింది.

సినిమా షూట్ చివరి రోజు కీర్తి సురేష్ యూనిట్ సభ్యులందరినీ సర్ప్రైజ్ చేసింది. ప్రతి ఒక్క యూనిట్ సభ్యడికి 2 గ్రాముల బంగారు కాయిన్ ను బహుమతిగా ఇచ్చింది. మొత్తం 130 మంది సభ్యులకు ఇలా గిఫ్డ్ లు అందించింది. అంటే దాదాపు ఆరున్నర లక్షల రూపాయల విలువైన బంగారు కాయిన్స్ అన్నమాట.

మహానటి సినిమా టైమ్ లో ఇలాగే కీర్తి సురేష్ బహుమానాలు అందించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా. తనకు యూనిట్ తో ట్రావెల్ తనకు నచ్చితే ఇలా చేస్తుందట కీర్తి సురేష్. దసరా సినిమా భారీ వ్యయంతో నిర్మాణమవుతోంది. నాని కెరీర్ లోనే దాదాపు 65 కోట్ల వ్యయంతో నిర్మాణమైందీ సినిమా. కొత్త దర్శకుడు ఈ సినిమాకు పని చేస్తున్నారు. సింగరేణి బ్యాక్ డ్రాప్ లో రగ్డ్ అండ్ రఫ్ జానర్ లో తయారవుతోంది దసరా.