‘ వి ‘ సినిమా ఎంత మంది చూస్తారు?

తొలిసారి ఓ పెద్ద సినిమా నేరుగా ఓటిటి లో విడుదలవుతోంది. అయిదు నెలలు గా తెలుగు ప్రేక్షకులు ఓ కొత్త సినిమా చూడడానికి మొహం వాచిపోయివున్నారు. ఇలాంటి టైమ్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ-నాని-సుధీర్ బాబు-నివేదా…

తొలిసారి ఓ పెద్ద సినిమా నేరుగా ఓటిటి లో విడుదలవుతోంది. అయిదు నెలలు గా తెలుగు ప్రేక్షకులు ఓ కొత్త సినిమా చూడడానికి మొహం వాచిపోయివున్నారు. ఇలాంటి టైమ్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ-నాని-సుధీర్ బాబు-నివేదా థామస్ లాంటి క్రేజీ కాంబినేషన్ తో 'వి' సినిమా విడుదలవుతోంది. అయిదునెలలుగా కొత్త సినిమా లేకపోవడం అంటే తెలుగు ప్రేక్షకులకు దాదాపు అన్ని రోజుల పాటు పస్తులు వుంచినట్లే.

కరోనా ఆరంభంలో ఓటిటి సైట్ లు కెలికి కెలికి కనిపించిన ప్రతి చిన్న, పెద్ద సినిమా, వెబ్ సిరీస్ అన్నీ చూసేసారు. ఇక మిగిలింది ఏమీ లేక, గత మూడు నెలలుగా నీరసపడిపోయారు. ఏవొ ఒకరీ అరా సినిమాలు వచ్చాయి కానీ అర్జెంట్ గా అర్ధరాత్రి మేల్కొని మరీ చూడాలని అనిపించే సినిమా ఒక్కటీ లేదు. ఇలాంటి దారుణ కరువు టైమ్ లో వి సినిమా వస్తోంది. 

అదే దాని అదృష్టం. సరైన ప్రచారం, పబ్లిసిటీ  లేకపోయినా, అంటే రెగ్యులర్ విడుదల మాదిరిగా లేకపోయినా, జనాలు చూడడం అయితే పక్కా. ఎందుకంటే అమెజాన్ ప్రయిమ్ సబ్ స్క్రయిబర్లు కొత్తగా డబ్బలు ఏమీ ఇవ్వనక్కరలేదు. ఆల్రెడీ చెల్లించేసారు కాబట్టి ఫ్రీగా చూడడమే.

అమెజాన్ ప్రయిమ్ కు ఇండియాలో కొటి మంది వరకు సబ్ స్క్రయిబర్లు వున్నారు అని మార్కెట్ వర్గాల బోగట్టా. మరి తెలుగునాట ఎంతమంది వుంటారో చూడాలి. కొత్తగా వస్తున్న ఓటిటి లే ఎనిమిది లక్షల మంది వరకు సబ్ స్క్రయిబర్లను తెచ్చుకున్నాయి. అలాంటిది అమెజాన్ అంటే కనీసంలో  కనీసం ఓ ఇరవై లక్షల మంది వరకు వుండే అవకాశం వుంది.

సినిమా కనుక నేరుగా థియేటర్ లో విడుదల అయితే తొలి రోజు కనీసం ఆరేడు లక్షల మంది చూసే అవకాశం వుంటుంది. ఎందుకంటే నాని సినిమా అటు ఇటు ఏ విడుదలలు లేకపోతే ఆరు వందల థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం వుంటుంది. అంటే 2400 షో లు.  అంటే కనీసం ఆరేడు లక్షల మంది తొలి రోజు చూసే అవకాశం వుంటుందని అంచనా వేసుకోవచ్చు. 

అమెజాన్ ప్రయిమ్ లో కూడా ఇదే విధంగా వుండే అవకాశం వుంది. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారిలో యూత్ అంతా కచ్చితంగా తొలి రోజే చూసే అవకాశం వుంది. అయితే అమెజాన్ ప్రయిమ్ కు వి సినిమా కారణంగా ఎంత మందికొత్తగా సబ్ స్క్రయిబర్లు వస్తారు? అన్నది చూడాల్సి వుంది. నిజానికి ఇటీవల ఓటిటి లో విడుదలయిన కొన్ని సినిమాలతో చూసుకుంటే వి సినిమాకు పబ్లిసిటీ కాస్త తక్కువే వుంది.

అందువల్ల మౌత్ పబ్లిసిటీ, రివ్యూలు వస్తే తప్ప, కొత్త సబ్ స్క్రయిబర్లు వచ్చే అవకాశం తక్కువ. అందువల్ల కొత్త, పాత అన్నీ ఎన్ని లెక్కలు (అఫీషియల్ సభ్యుల సంఖ్య తెలియదు కనుక) మహా అయితే ఇరవై లక్షల మందికి మించి అమెజాన్ ప్రయిమ్ లో సినిమాను చూస్తారా?అన్నది డౌట్.

కానీ అదే ధియేటర్ అయితే సినిమా యావరేజ్ రన్ కూడా కనీసం నాలుగువారాలు వుంటుంది. సి సెంటర్ నుంచి ఏ సెంటర్ వరకు చూసేవారే సంఖ్య కోటికి దగ్గరగానో కొటికి పైనో వుంటుంది. అమెజాన్ ప్రయిమ్ లో విడుదల చేసిన కొన్ని నెలల తరువాత థియేటర్ లో విడుదల చేసే ఆప్షన్ వుంది అని వినిపిస్తోంది.

ఆ లెక్కన వి సినిమా ఒటిటి లో హిట్ అయితే కనుక, కచ్చితంగా సంక్రాంతికి లేదా క్రిస్మస్ కు థియేటర్ విడుదల వుండే అవకాశం వుంది. అంతే కాదు వి సినిమా ఫలితం, లెక్కలు భవిష్యత్ లో తెలుగు సినిమా ల విడుదలలను కొంతయినా ప్రభావితం చేసే అవకాశం వుంది

భగవద్గీత వల్లిస్తే చాలదు.. బాణం పట్టాలి