పవన్ కళ్యాణ్ కొత్త సరదా

హీరోలు, సెలబ్రిటీలు, ఆ మాటకు వస్తే రాజకీయ నాయకుల సోషల్ మీడియా అక్కౌంట్లు అన్నీ ప్రయివేటు వ్యక్తులు చూస్తారు. దానికి గాను వారికి కొంత ఫీజు వుంటుంది. అయితే వేసే ప్రతి ట్వీటు అక్కౌండ్…

హీరోలు, సెలబ్రిటీలు, ఆ మాటకు వస్తే రాజకీయ నాయకుల సోషల్ మీడియా అక్కౌంట్లు అన్నీ ప్రయివేటు వ్యక్తులు చూస్తారు. దానికి గాను వారికి కొంత ఫీజు వుంటుంది. అయితే వేసే ప్రతి ట్వీటు అక్కౌండ్ హొల్టర్ అనుమతితోనే వుంటుంది. స్వంతంగా ట్విట్టర్ అక్కౌంట్లు చూసుకునే సెలబ్రిటీలు చాలా తక్కువ మంది వుంటారు. ఇప్పుడు ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చేరినట్లు తెలుస్తోంది.

నిన్నటికి నిన్న ఆయన బర్డ్ డే సందర్బంగా ఎందరో పొలిటికల్, సినిమా సెలబ్రిటీలు ఆయనకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు, అంతే కాదు ఫ్యాన్స్, సినిమా రంగంలో వున్న పలు రంగాలకుచెందిన వారు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిన్నటి నుంచి పవన్ ఒకటే పని పెట్టుకున్నారు. వీలయినంత మందికి ట్విట్టర్ లో బదులు ఇవ్వడం. జాతీయ, ప్రాంతీయ భాజపా నాయకులు, అలాగే వివిధ పార్టీలకు చెందిన పొలిటికల్ లీడర్లకు, అలాగే సినిమా జనాలకు కూడా పవన్ నే స్వయంగా ట్విట్టర్ లో సమాధానాలు ఇస్తున్నారు.

ఎవరు శుభాకాంక్షలు చెబుతున్నారు అన్నది గమనించి, వారి గురించి ఆలోచించి, వారికి అనుగుణంగా సమాధానాలు పెడుతూ అందరినీ ఆకట్టకున్నారు. ఇవన్నీ పవన్ తనే స్వయంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.  నిన్నటి నుంచి ఇప్పటివరకు పదుల సంఖ్యలో ట్వీట్ లు వేసి అనేక మందికి పవన్ సమాధానాలు ఇవ్వడం విశేషం.  మొత్తానికి ఒకేసారి మూడు కొత్త సినిమాలు ప్రకటించిన పవన్ కొత్త వ్యాపకం బాగుంది.