పొద్దు పొద్దున్నే విశాఖ వణికింది

మొత్తం ప్రపంచంతో పాటే విశాఖ కూడా ఆదివారం నిద్ర లేచింది. సండే హాలీ డే కావడంతో బద్ధకంగా ఒళ్ళు విరుచుకునే జనాలను ఒక్కసారిగా వణుకు పుట్టించాయి భూ ప్రకంపనలు. Advertisement ఒక పెద్ద శబ్దంతో…

మొత్తం ప్రపంచంతో పాటే విశాఖ కూడా ఆదివారం నిద్ర లేచింది. సండే హాలీ డే కావడంతో బద్ధకంగా ఒళ్ళు విరుచుకునే జనాలను ఒక్కసారిగా వణుకు పుట్టించాయి భూ ప్రకంపనలు.

ఒక పెద్ద శబ్దంతో పాటు కింద భూమి కృంగిపోతున్న ఫీలింగ్, ఇంట్లో వస్తువులు చెదిరాయి. కిటికీలు కొట్టుకున్నాయి. దీంతో భయపడిన జనాలు ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఏం జరుగుతోంది అని తెలియక  భీతిల్లిపోయారు. విశాఖలో స్వల్ప భూకంప ప్రకంపనలు ఉదయం ఏడుగంటల పదమూడు నిముషాల ప్రాంతంలో సంభవించాయి. విశాఖ సిటీలోని మొత్తం తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ ప్రకంపనలు కొనసాగాయి.

గాజువాకలో మొదలుపెడితే అక్కయ్యపాలెం, కంచరపాలెం, సీతమ్మధార, బీచ్ రోడ్డు, ఎంవీపీ కాలనీ తదితర ప్రాంతాలలో భూ ప్రకంపనల ఫీలింగ్ ని జంగం ప్రత్యక్షంగా అనుభవించారు. రిక్టర్ స్కేల్ మీద దీని ప్రభావం.1.8గా రికార్డు అయిందని అంటున్నారు. పెద్దగా భయపడాల్సింది లేదు అని నిపుణులు చెబుతున్నా విశాఖ వాసులకు 2004 డిసెంబర్ 26 నాటి చేదు అనుభవాలే గుర్తుకు వచ్చాయి.

నాడు ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో  వచ్చిన సునామీ తాలూకా ప్రభావం కొంత వరకూ విశాఖ సిటీ  మీద పడింది. నాడు కూడా భూమి కంపించింది. అది కూడా ఉదయం సమయం కావడం విశేషం. మొత్తానికి భూ కంపం ఫీలింగ్ ని అయితే తాము అంతా స్వయంగా అనుభవించామని విశాఖ జనం అంటున్నారు. ఏది ఏమైనా పొద్దు పొద్దున్నే విశాఖ మాత్రం వణికింది.