చంద్రబాబును మించిన అపర చాణక్యుడు

చంద్రబాబును మించిన అపర చాణక్యుడు లేడనేది తెలుగోల్లలో చాలామంది, భారత దేశంలో కొంతమంది అభిప్రాయం. ఒక కోణంలో ఆలోచిస్తే అది వాస్తవం కూడా. నాదెండ్ల భాస్కరరావు చేస్తే వెన్నుపోటు, చంద్రబాబు చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ.…

చంద్రబాబును మించిన అపర చాణక్యుడు లేడనేది తెలుగోల్లలో చాలామంది, భారత దేశంలో కొంతమంది అభిప్రాయం. ఒక కోణంలో ఆలోచిస్తే అది వాస్తవం కూడా. నాదెండ్ల భాస్కరరావు చేస్తే వెన్నుపోటు, చంద్రబాబు చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ. లక్షీ పార్వతి అనే అతి శక్తివంతమైన దుష్ట శక్తి నుండి పార్టీని కాపాడటం. 

ఎన్టీఆర్ పెట్టిన పార్టీని కాపాడటం కోసం ఆయన్నే పదవీచ్యుతుడ్ని చేస్తే గొల్లుమని ఏడ్చుకుంటూ ఆయన గుండెపోటుతో మరణిస్తే ఆయన ఫోటోతోనే ఈ రోజుకీ ఓట్లు అడుక్కోవడం చాణుక్యం కాక మరేంటి? కానీ దేశవాసులు ఏ మాయలో ఉన్నా తెలుగు ప్రజలు మాత్రం చాలా సార్లు కర్రు కాల్చి వాతలు పెట్టారు. 2019లో 175కి 23, 25కి 3 ఇచ్చి తమ ఆగ్రహం చూపించారు.

తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్ల కేసులో డబ్బులు, ఆడియోలతో సహా అడ్డంగా దొరికినా ఒక్కసారి కూడా కోర్టు గడప ఎక్కకపోవడం చాణుక్యం కాక మరేంటి? మీకూ సీఐడీ ఉంది నాకూ సీఐడీ ఉంది, నా ఫోన్ టాపింగ్ చేసే అధికారం మీకెవరిచ్చారు లాంటి వాక్యాలే ఆయన పలికారు కానీ తను తప్పుచేయలేదనే మాట ఒక్కసారి కూడా పలకలేదు.

ఇప్పుడు 118 కోట్ల రూపాయల స్కాంలో కూడా ఐటీ అధికారులిచ్చిన నోటీసులకు కూడా మీకు జూరిడిక్షన్ లేదనే అంటున్నారు తప్ప తన అకౌంట్లలోకి వచ్చిన 118 కోట్ల రూపాయల డబ్బు గురించి మాట్లాడనే మాట్లాడరు. రామోజీ రావు కూడా అంతే. మార్గదర్శి చిట్ ఫండ్స్ డబ్బుని తన వేరే కంపెనీలకు అక్రమంగా మళ్ళించడం గురించి అసలు మాట్లాడరు. 

మా కస్టమర్లు కంప్లైన్ చేయలేదు కదా అనే అడుగుతాడు లేకపోతే పత్రికా స్వేచ్ఛకు భంగమంటాడు. పత్రికాదిపతులు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి చీటీ పాటల వ్యాపారం చేయమని ఏ సెక్షన్లో చెప్పారో మరి? ఇక జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎవరు కంప్లైన్ చేస్తే రోజూ నాలుగు పేజీల చొప్పున పదేళ్లు అచ్చేసారు ఆర్థిక నేరస్థుడని? వాళ్ళు చేస్తే సంసారం అవతలోల్లు చేస్తే వేరే…

చంద్రబాబు విషయంలో ఈ రోజు ఐటీ అధికారులు, రామోజీ రావు విషయంలో సీఐడీ పట్టుకున్నది వారి తోకలే. వాళ్ళు పిల్ల కాలవలు కాదు అంతే లేని సముద్రాలు. నలభై ఏళ్లకు పైగా వ్యవస్థలలో తమ మనుషులను పెట్టుకుని ఆర్థిక తీవ్రవాదానికి పాల్పడ్డ అవినీతి అనకొండలు. వీళ్ళు పోయేలోగా ఒక్కసారైనా జైళ్లో పడకపోతే లోకంలో సహజ న్యాయం లేనట్టే!

గురవా రెడ్డి, న్యూ యార్క్