అచ్చెన్నాయుడు నెగిటివేనా?

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ మధ్యనే కరోనా బారిన పడి నెగిటివ్ తో ఆరోగ్యవంతులయ్యారు. ఆయనకు బెయిల్ కూడా వచ్చింది. దాదాపు మూడు నెలల తరువాత మళ్ళీ ఆయన రాజకీయంగా క్రియాశీలం కానున్నారు. అచ్చెన్న…

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ మధ్యనే కరోనా బారిన పడి నెగిటివ్ తో ఆరోగ్యవంతులయ్యారు. ఆయనకు బెయిల్ కూడా వచ్చింది. దాదాపు మూడు నెలల తరువాత మళ్ళీ ఆయన రాజకీయంగా క్రియాశీలం కానున్నారు. అచ్చెన్న అంటే చంద్రబాబుకు కుడిభుజం అన్న సంగతి తెలిసిందే.

ఇక బాబు కోసం ఎందాకైనా అంటూ అచ్చెన్న రాజకీయం ఇప్పటిదాకా కొన‌సాగించడమూ అంతా చూశారు.  ఈ మధ్యనే  అచ్చెన్నాయుడు ఈఎస్ ఐ స్కాం లోఅ అరెస్ట్ అయి రిమాండులో చాలా కాలమే ఉన్నారు. దాంతో ఈ గ్యాప్ లో  కొత్త అచ్చెన్నను చూడగలుగుతామా  అన్న చర్చ ఒకటి పొలిటికల్ సర్కిల్స్ లో  సాగుతోంది.

అచ్చెన్న అంటే దూకుడు రాజకీయానికి పేరు. బాబు చెబితే  ఓకే అంటూ విరుచుకుపడిపోతారు. మరి అరెస్ట్ అయ్యాక ఆయనకు రాజకీయాలు , నిజానిజాలు అన్నీ కూడా  బోధపడిఉంటాయని అంటున్నారు.

మరి అచ్చెన్నకు కరోనా పాజిటివ్ వచ్చిందని అభిమాన జనం అల్లల్లాడారు. ఆయనకు నెగిటివ్ వచ్చిందని సంతోషించారు. మరి పాలిటిక్స్ లో అచ్చెన్న పాజిటివ్ థింకింగ్ తో ఇకపైన సాగుతారా అన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ. ప్రతిపక్షంలో ఉంటే నెగిటివ్ థింకింగ్ ఉండాలని ఏమీ లేదు, మంచిని మంచిగా చూస్తూ, సలహాలు ఇస్తూ పాజిటివ్ రాజకీయాలూ చేయవచ్చు.

బీసీలకు దేవుడు  మాదిరి నేత సర్దార్ గౌతు లచ్చన్న వంటి మహనీయులు ఇదే పంధాను అనుసరించారు. ఆయన పుట్టిన శ్రీకాకుళం గడ్డ మీద పుట్టిన అచ్చెన్న ఫ్యూచర్ పాలిటిక్స్ ని  తాజా పరిణామాలు ఏమైనా ప్రభావితం చేస్తాయా అన్నది అందరిలోనూ ఆసక్తి మరి.

రైటింగ్ లో భలే మజా వస్తుంది

ఇడుపులపాయలో జగన్