ఆ చివరి పేజీలో ఏముంది?

మర్డర్ మిస్టరీలకు కొంచెం యాక్షన్, ఇంకాస్త థ్రిల్ జోడిస్తే ప్రామిసింగ్ మూవీ తయారవుతుంది. గతంలో వచ్చిన ఎన్నో సినిమాలు ఈ విషయాన్ని రుజువుచేశాయి. ఇప్పుడు ఇదే కోవలో వస్తోంది హంట్ మూవీ. సుధీర్ బాబు…

మర్డర్ మిస్టరీలకు కొంచెం యాక్షన్, ఇంకాస్త థ్రిల్ జోడిస్తే ప్రామిసింగ్ మూవీ తయారవుతుంది. గతంలో వచ్చిన ఎన్నో సినిమాలు ఈ విషయాన్ని రుజువుచేశాయి. ఇప్పుడు ఇదే కోవలో వస్తోంది హంట్ మూవీ. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ కొద్దిసేపటి కిందట రిలీజైంది. ట్రయిలర్ చూస్తే ఇదొక ఇంటెన్స్ మర్డర్-మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ అనే విషయం అర్థమౌతోంది.

ఏసీపీ అర్జున్ గా సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజైంది. అతడి యాక్షన్ కు సంబంధించి మేకింగ్ వీడియో కూడా వచ్చింది. ఇప్పుడు ట్రయిలర్ లో సిసలైన యాక్షన్ సన్నివేశాలు చూపించారు. జాన్ విక్-4 లాంటి యాక్షన్ సినిమాలకు వర్క్ చేసిన స్టంట్ మాస్టర్లతో ఈ సినిమాలో యాక్షన్ బ్లాక్స్ తీశారు. ట్రయిలర్ లో అవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇక హీరో పాత్రను మెమొరీ లాస్ పేషెంట్ గా చూపించడం కూడా ఉత్సుకతను పెంచుతోంది. హై-ప్రొఫైల్ కేసు విచారణ మధ్యలో ఉండగా, హీరోకు మెమొరీ లాస్ అవుతుంది. అలా గతాన్ని మరిచిపోయిన హీరో, ఆ కేసును తిరిగి మొదట్నుంచి ఎలా ఛేదించాడనేది హంట్ సినిమా. ట్రయిలర్ లో యాక్షన్ బ్లాక్స్ తో పాటు.. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

ఈ సినిమాలో సుధీర్ బాబుకు హీరోయిన్ లేదు. అందుకే అప్సర రాణితో ఐటెంసాంగ్ పెట్టారు. ఆ పాట కూడా ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసింది. ఇక స్టార్ కాస్ట్ విషయానికొస్తే.. సుధీర్ బాబు తప్ప మిగతావాళ్లలో అంతగా క్రేజ్ ఉన్న నటీనటులు కనిపించడం లేదు.

పూర్తిగా కంటెంట్ పై నమ్మకంతో వస్తున్న ఈ సినిమా, రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ కాబోతోంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహేష్ దర్శకుడు.