షారూక్ హీరోగా నటించిన సినిమా పఠాన్. ఈ సినిమాలోని బేషారమ్ సాంగ్ ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఏకంగా సినిమానే నిషేధించాలంటూ ఉద్యమం ఊపందుకుంది. అలా దేశవ్యాప్తంగా కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ఈ సాంగ్ పై సెన్సార్ ఎలా స్పందింస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
సెన్సార్ లో ఈ పాటను పూర్తిగా తొలిగిస్తారని కొందరు భావించారు. ఎట్టకేలకు వివాదాస్పదంగా మారిన ఈ సాంగ్ పై సెన్సార్ బోర్డ్ రియాక్ట్ అయింది. ఆ పాటపై కత్తెర్లు వేసింది తప్ప, పూర్తిగా తొలిగించలేదు.
ఈ సాంగ్ లో దీపిక పదుకోన్ అంగాంగ ప్రదర్శన చేసింది. అలా శృతిమించిన సన్నివేశాలు మూడింటిని బోర్డ్ తొలిగించింది. ఇక వివాదాస్పదమైన కాషాయ బికినీపై కూడా కత్తెర పడింది. దీన్ని గోల్డెన్ కలర్ బికినీగా పేర్కొన్న సెన్సార్ బోర్డ్, ఆ సన్నివేశంలో దీపిక హోయలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆ సీన్స్ తీసేసింది. వీటితో పాటు పాటలో అభ్యంతరకరంగా ఉన్న ఓ డాన్స్ మూమెంట్ ను కూడా కట్ చేసింది.
ఇలా పాటకు భారీగానే కత్తెర్లు వేసి ఆమోదముద్ర వేసింది సెన్సార్ బోర్డ్. ఇక సినిమా విషయానికొస్తే, సినిమాలో కూడా పదికి పైగా కట్స్ సూచించింది. అభ్యంతరకరమైన కొన్ని డైలాగ్స్ ను కూడా కట్ చేసి, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది. యు/ఏ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా నిడివి 2 గంటల 26 నిమిషాల 16 సెకెన్లు ఉంది. 25న థియేటర్లలోకి వస్తోంది పఠాన్ సినిమా.