మళ్లీ డిజె టిల్లు సాంగ్ మ్యాజిక్

డిజె టిల్లు సినిమాలో టైటిల్ సాంగ్ ఎంత చార్ట్ బస్టర్ అన్నది అందరికీ తెలిసిందే. అసలు ఆ సినిమా విజ‌యానికి ఆ పాట చేసిన సాయం ఇంతా అంతా కాదు. ఇప్పుడు డిజె టిల్లు…

డిజె టిల్లు సినిమాలో టైటిల్ సాంగ్ ఎంత చార్ట్ బస్టర్ అన్నది అందరికీ తెలిసిందే. అసలు ఆ సినిమా విజ‌యానికి ఆ పాట చేసిన సాయం ఇంతా అంతా కాదు. ఇప్పుడు డిజె టిల్లు సీక్వెల్ రెడీ అవుతోంది. జ‌నాలు కచ్చితంగా అలాంటి సాంగ్ మ్యాజిక్ కోసం ఎదురు చూస్తారు. అందులో సందేహం లేదు. పైగా డిజె టిల్లు సీక్వెల్ చాలా భారీగా రెడీ అవుతోంది. ప్రొడక్షన్ కాస్ట్, మార్కెట్ రెండూ ఓ రేంజ్ కు పెరిగిపోయాయి.

అందుకే డిజె టిల్లు సీక్వెల్ లో కూడా ఓ మాంచి పాట రెడీ చేస్తున్నారు. రామ్ మిరియాల నే స్వయంగా స్వరపర్చిన పాడిన ఈ పాట చాలా బాగా వచ్చిందని బోగట్టా. ఈ పాట వన్స్ బయటకు వస్తే చాలా కాలం పాట వైరల్ గా వుంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య రామ్ మిరియాల ఏ సినిమాలో పాట పాడినా క్యాచీగా వుండి, వెంటనే జ‌నాల్లోకి వెళ్లిపోతోంది. డిజె టిల్లు సీక్సెల్ తో మరింత మోత మోగుతుందని తెలుస్తోంది.

సిద్దు జొన్నల గడ్డ ఆల్ ఇన్ వన్ అన్నట్లుగా డిజె టిల్లు 2 ను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సైలంట్ గా మార్కెటింగ్ చేసేస్తున్నారు. ఓవర్ సీస్ రైట్స్, నాన్ థియేటర్ రైట్స్ వన్ బై వన్ క్లోజ్ చేస్తున్నారు. నైజాం ఏరియాకు 9 కోట్ల రేట్లు పలుకుతోందని తెలుస్తోంది. డిజె టిల్లు పార్ట్ వన్ నైజాంలో 7 కోట్లకు పైగా వసూలు చేసింది.