ఈరోజు ఓపెనింగ్.. రెగ్యులర్ షూటింగ్ మాత్రం..!

బాలయ్య కొత్త సినిమా లాంఛ్ అయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. హీరోయిన్ శృతిహాసన్ కూడా లాంఛింగ్ కు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతా బాగుంది…

బాలయ్య కొత్త సినిమా లాంఛ్ అయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. హీరోయిన్ శృతిహాసన్ కూడా లాంఛింగ్ కు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతా బాగుంది కానీ సినిమా మాత్రం ఇప్పట్లో సెట్స్ పైకి రాదు. జనవరి నుంచి మాత్రమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ రెడీగా ఉంది. కొన్ని నెలలుగా దీనిపై కసరత్తు చేస్తున్న గోపీచంద్ మలినేని, ఫైనల్ వెర్షన్ రెడీ చేశాడు. అటు బాలయ్య కూడా అఖండ సినిమా పూర్తిచేశాడు. ఆ సినిమాకు సంబంధించి బాలయ్య చేయాల్సింది ప్రచారం మాత్రమే. మిగతా అన్ని పనులు పూర్తయ్యాయి. అయినప్పటికీ సినిమా మరో 2 నెలలు సెట్స్ పైకి రావడం లేదు. దీనికి కారణం శృతిహాసన్ అని తెలుస్తోంది.

పట్టుబట్టి మరీ ఈ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు గోపీచంద్ మలినేని. అతడికి ఆమె సెంటిమెంట్. అయితే శృతిహాసన్ ఒప్పుకుంది కానీ కాల్షీట్లు మాత్రం వెంటనే ఇవ్వలేదు. జనవరి నుంచి మాత్రమే ఆమె ఫ్రీ అవుతుంది. ఈలోగా కావాలంటే బాలయ్యతో షూట్ స్టార్ట్ చేయొచ్చు. 

కానీ బాలయ్య ''ఆహా'' అంటున్నారు. వరుసగా సినీప్రముఖుల్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. పైగా శృతిహాసన్ కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాతే సెట్స్ పైకి వెళ్దామని బాలయ్య చెప్పడంతో మూవీ రెగ్యులర్ షూటింగ్ కాస్త ఆలస్యంగా మొదలుకాబోతోంది.

ఈమధ్య ఏ పెద్ద సినిమా ఓపెన్ అయినా డైరక్టర్స్ బ్యాచ్ మొత్తం వాలిపోతోంది. ఈరోజు కూడా బాలయ్య సినిమా ఓపెనింగ్ కు బుచ్చిబాబు, హరీశ్ శంకర్, బోయపాటి, కొరటాల, వినాయక్, బాబి లాంటి దర్శకులంతా హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అఖండకు కూడా ఇతడే మ్యూజిక్ డైరక్టర్.