నానికి ఇష్టమైన ‘బ్రాండ్’ ఇదే

బాలకృష్ణ చేసే టాక్ షోలో ఏదైనా ప్రత్యేకమైన అంశం ఉందంటే, అది సెలబ్రిటీల మద్యం బ్రాండ్లు కనుక్కోవడమే. బాలయ్య బ్రాండ్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లోకమంతా తెలుసు. ఆమధ్య తన షోలో మోహన్ బాబు…

బాలకృష్ణ చేసే టాక్ షోలో ఏదైనా ప్రత్యేకమైన అంశం ఉందంటే, అది సెలబ్రిటీల మద్యం బ్రాండ్లు కనుక్కోవడమే. బాలయ్య బ్రాండ్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లోకమంతా తెలుసు. ఆమధ్య తన షోలో మోహన్ బాబు బ్రాండ్ ఏంటో చెప్పించారు బాలయ్య. ఇప్పుడు నాని వంతు వచ్చింది.

బాలయ్య ప్రశ్న: నేను పొద్దున్నంచి రాత్రి వరకు కష్టపడతాను. రిలాక్స్ అవ్వడానికి సాయంత్రం నాన్నగారి సినిమాలు చూస్తాను. ఇంకాస్త రిలాక్స్ అవ్వడానికి మేన్సన్ హౌజ్ తాగుతాను. మరి నువ్వు ఎలా రిలాక్స్ అవుతావు నాని?

నాని సమాధానం: రిలాక్స్ అవ్వాలంటే ఏదో ఒక సినిమా చూడాల్సిందే. మ్యూజిక్ కూడా వింటాను. మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతాను. అప్పుడప్పుడు రెడ్ వైన్ తాగుతాను.

ఇలా నానితో కూడా తన బ్రాండ్ ఏంటో చెప్పించారు బాలయ్య. ఇకపై బాలయ్య షోకు వచ్చే వాళ్లు ఈ ప్రశ్నకు సమాధానం ముందుగానే ప్రిపేర్ అయితే మంచిది. మూడో ఎపిసోడ్ లో భాగంగా వెంకటేష్ ను ఇంటర్వ్యూ చేశారట బాలయ్య. మరి వెంకీ మామ ఏ బ్రాండ్ పేరు చెబుతారో చూడాలి.

ఇదే టాక్ షోలో మరో ఇంట్రెస్టింగ్ చర్చ కూడా నడిచింది. బాలయ్య-నాని కలిసి సినిమా చేస్తే ఆ మూవీ ఎలా ఉండాలనేది ప్రశ్న. దీనికి నాని చాలా డిఫరెంట్ గా సమాధానం ఇచ్చాడు. హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ గాడ్ ఫాదర్ (1972) ను తెలుగులో రీమేక్ చేస్తే, అందులో బ్రాండోగా బాలయ్య, తను అల్ పచినోగా నటిస్తే బాగుంటుందన్నాడు నాని.