ప్రేమలో పడాలని ఉందంటున్న బిజీ హీరోయిన్

హీరోయిన్లు, ప్రేమలు కామన్. వీటిని విడదీసి చూడలేం. కొంతమంది ప్రేమిస్తున్నామని పైకి చెబుతారు, మరికొందరు హీరోయిన్లు సైలెంట్ గా, సీక్రెట్ గా డేటింగ్స్ కానిచ్చేస్తారు. ప్రేమ పండితే ఓకే, లేదంటే మరో ప్రేమికుడు. ఇలా…

హీరోయిన్లు, ప్రేమలు కామన్. వీటిని విడదీసి చూడలేం. కొంతమంది ప్రేమిస్తున్నామని పైకి చెబుతారు, మరికొందరు హీరోయిన్లు సైలెంట్ గా, సీక్రెట్ గా డేటింగ్స్ కానిచ్చేస్తారు. ప్రేమ పండితే ఓకే, లేదంటే మరో ప్రేమికుడు. ఇలా సాగుతుంది వ్యవహారం. అయితే ఈ  ప్రహసనంలోకి తను ఎంటర్ కాలేదని చెబుతోంది హీరోయిన్ శ్రీలీల.

స్కంద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన శ్రీలీల, బ్రేకప్ అయిందా లేదా అనే ప్రశ్నకు స్పందించింది. తను ఇప్పటివరకు లవ్ లో పడలేదని, కాబట్టి బ్రేకప్ అనే ప్రశ్న తలెత్తదని సమాధానం చెప్పింది.

ఇప్పటివరకు తను ఎలాంటి రిలేషన్ షిప్ పెట్టుకోలేదని తెలిపిన ఈ బిజీ హీరోయిన్, ప్రేమలో పడాలని ఉందంటూ తన మనసులో కోరిక బయటపెట్టింది. ప్రతి ఒక్కరు తమ జీవితంలో లవ్ ఫేజ్ ను ఎంజాయ్ చేయాలని, అలాంటి దశను తను కూడా చూడాలనుకుంటున్నట్టు వెల్లడించింది.

అయితే ప్రేమలో పడి, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించే సమయం తనకు లేదని తేల్చేసింది ఈ హీరోయిన్. నిజమే, ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ శ్రీలీల మాత్రమే. ఆమెకు నిద్రపోవడానికే టైమ్ లేదు, ఇక ప్రేమలో ఏం పడుతుంది? సో.. శ్రీలీల కోరిక తీరడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది.