ఓ క్రికెటర్ భావోద్వేగ బయోపిక్

అన్ని కథలు నవరసాలతో నిండి వుండవు. అలా నవరసాలు నిండిన నిజ జీవిత గాథలే వెండి తెర మీద బయోపిక్ లుగా రూపాంతరం చెందుతాయి.  Advertisement ప్రముఖ క్రికెట్ ముత్తయ్య మురళీ ధరన్ జీవితం…

అన్ని కథలు నవరసాలతో నిండి వుండవు. అలా నవరసాలు నిండిన నిజ జీవిత గాథలే వెండి తెర మీద బయోపిక్ లుగా రూపాంతరం చెందుతాయి. 

ప్రముఖ క్రికెట్ ముత్తయ్య మురళీ ధరన్ జీవితం మొత్తం ఇలాంటి ఎత్తు పల్లాలతో, వెలుగు చీకట్లతో, బలమైన భావోద్వేగలతో నిండి వుంటుంది. అందుకే దాన్ని బయోపిక్ గా మార్చి పలు భాషల్లో విడుదలకు సిద్దం చేస్తన్నారు. సినిమాను సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పిస్తున్నారు. ట్రయిలర్ ను ఈ రోజు విడుదల చేసారు.

శ్రీలంకలో తమిళుల ఉద్యమం దగ్గర నుంచి భాష, జాతి ఇలా సమస్య విషయాలు ఈ కథలో చోటు చేసుకున్నాయి. కేవలం చాలా కింది నుంచి పైకి ఎదిగిన క్రికెటర్ కథ గా మాత్రమే సినిమాను రూపొందించలేదు. అంతకు మించి వుంది సినిమాలో. ఈ విషయమే స్పష్టమయింది ట్రయిలర్ లో. 

జాతి, భాష, క్రీడా రాజకీయాలు అన్నీ తొంగి చూసాయి ట్రయిలర్ లోనే.  దర్శకుడు శ్రీపతి ఈ విషయంలో చాలా వర్కవుట్ చేసి, అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ట్రయిలర్ చెప్పకనే చెబుతోంది.

రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ అంశాలు మేళవించకపోయినా, ఓ బలమైన కథకు కావాల్సిన అన్ని అంశాలను స్క్రిప్ట్ లోకి తెచ్చినట్లు కనిపిస్తోంది. మత్తయ్య మురళీధరన్ గా మహామ నంబియార్ పెర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఈ సినిమా అక్కోబర్ లో థియేటర్రలోకి వస్తుంది.