ఎట్టకేలకు పూజా హెగ్డేకు ఓ ఛాన్స్?

ఈమధ్య కెరీర్ పరంగా పూజాహెగ్డేకు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఫ్లాపులతో పాటు అందివచ్చిన అవకాశాలు కూడా చేజారిపోయాయి. దీంతో డీలా పడిన ఈ బ్యూటీ, ఎట్టకేలకు మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. ఈసారి…

ఈమధ్య కెరీర్ పరంగా పూజాహెగ్డేకు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఫ్లాపులతో పాటు అందివచ్చిన అవకాశాలు కూడా చేజారిపోయాయి. దీంతో డీలా పడిన ఈ బ్యూటీ, ఎట్టకేలకు మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. ఈసారి పూజాహెగ్డేకు బాలీవుడ్ నుంచి పిలువు వచ్చింది.

షాహిద్ కపూర్ హీరోగా ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రాబోతోంది. దీనికి కోయి షక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మలయాళీ ఫిలిం మేకర్ రోషన్ ఆండ్రూస్ ఈ ప్రాజెక్ట్ ను డైరక్ట్ చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకుంటున్నారు. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

పూజాహెగ్డేకు కొన్నేళ్లుగా అదృష్టం కలిసిరావట్లేదు. ప్రభాస్, చిరంజీవి, సల్మాన్ లాంటి హీరోలతో సినిమాలు చేసినప్పటికీ హిట్ కొట్టలేకపోయింది. దీనికి తోడు మహేష్, పవన్ లాంటి స్టార్స్ సినిమాల్లో అవకాశాలు కోల్పోయింది. ఇలాంటి టైమ్ లో ఆమెకు షాహిద్ కపూర్ సినిమా ఆఫర్ వచ్చింది. ఇదైనా ఆమె వరకు చేరుతుందా? ఆఖరి నిమిషంలో చేజారుతుందా అనేది చూడాలి.

కిసీ కా భాయ్ కిసీకా జాన్, రాధేశ్యామ్, ఆచార్య… ఇలా పూజాహెగ్డే చేసిన సినిమాలేవీ సక్సెస్ కాలేదు. దీంతో ఆమె మళ్లీ తననుతాను నిరూపించుకునే పనిలో పడింది. ఇలాంటి టైమ్ లో షాహిద్ కపూర్ సినిమా ఆఫర్ రావడం ఆమెకు కలిసొచ్చే అంశం.