ఓజి..ఓవర్ సీస్ @13 కోట్లు

పవన్ కళ్యాణ్-సుజిత్ కాంబినేషన్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా ఓజి. ఇటీవల వదిలిన గ్లింప్స్ తో సినిమా మీద బజ్ అమాంతం లేచింది. ఈ ఏడాది చివరకు ఈ సినిమా విడుదలకు రెడీ…

పవన్ కళ్యాణ్-సుజిత్ కాంబినేషన్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా ఓజి. ఇటీవల వదిలిన గ్లింప్స్ తో సినిమా మీద బజ్ అమాంతం లేచింది. ఈ ఏడాది చివరకు ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. 

డిసెంబర్ నుంచి ఎప్పుడైనా విడుదల కావచ్చు. పవన్ ఇటీవల కాలంలో అన్నీ రీమేక్ లు చేస్తూ వస్తున్నారు. ఓజి రీమేక్ కాదు. మంచి అంచనాలు వుండడం, రీమేక్ కాకపోవడంతో మార్కెటింగ్ కు మంచి ఎంక్వయిరీలు మొదలయ్యాయి. దీంతో ముందుగా ఓవర్ సీస్ డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఓవర్ సీస్ ను 13 కోట్ల రేటుకు ఫారస్ ఫిలింస్ సంస్థ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ సినిమాలతో పోల్చుకుంటే మంచి రేటు అనే చెప్పాలి. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమా భీమ్లా నాయక్ కూడా తొమ్మిది కోట్ల రేంజ్ కు ఇచ్చారు. 13 కోట్లు అంటే మంచి రేటే. అలాగే కొన్న వాళ్లకు కూడా మంచి డీల్ నే.

ఎందుకంటే ఇటీవల సినిమా ఏమాత్రం బాగున్నా ఓవర్ సీస్ కలెక్షన్లు బాగుంటున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పవన్ క్రేజ్ కూడా నడుస్తోంది. అందువల్ల ఓజి జానర్, బజ్, క్రేజ్ అన్నీ చూసుకుంటే నిర్మాతకు, బయ్యర్ కు ఇద్దరికీ మంచి డీల్ నే ఇది.