ఎంత గొప్పోడికైనా ఏదో ఒక వీక్ నెస్ వుంటుంది. బుర్రా సాయి మాధవ్ ఎంత గొప్ప డైలాగ్ రైటర్ అయినా కావచ్చు. కానీ కామెడీలో మాత్రం పక్కా వీక్. ఈ విషయం ఇప్పటికే ఒకటికి రెండు సార్లు ప్రూవ్ అయింది.
సీరియస్, ఎమోషనల్ డైలాగులు ఎంత పవర్ ఫుల్ గా రాయ గలడో కామెడీ అంత రొట్టగా వుంటుంది. ఖైదీ 150 లో ఆలీ-బ్రహ్మీ కామెడీ సీన్లు గుర్తుకు వస్తే తెలుస్తుంది ఈ విషయం మరోసారి అర్థం అవుతుంది.
నిజానికి బుర్రా మంచి రైటర్..కొటి రూపాయల రెమ్యూనిరేషన్. కానీ సక్సెస్ గ్రాఫ్ చూస్తుంటే మాత్రం కిందకే జారుతోంది. మహానటి తరువాత సాక్ష్యం, కథానాయకుడు, మహానాయకుడు పరమ డిజాస్టర్లు. సైరా, రాజుగారి గది సిరీస్ లాంటి వాటి సంగతి చెప్పనక్కరలేదు. క్రాక్ సినిమా ఒక్కటే యాక్సిడెంటల్ హిట్. కోవిడ్ టైమ్ లో థియేటర్ లో సినిమాకు మొహం వాచిన ప్రేక్షకులకు అమృతంలా పనికివచ్చిన సినిమా అది.
ఆ తరువాత శ్రీకారం, గమనం, ఆకాశవాణి అన్నీ ఫ్లాపులే. ఆర్ఆర్ఆర్ సినిమా రాజమౌళి మ్యాజిక్ అని చెప్పనక్కరలేదు. దాని తరువాత వారియర్ సినిమా దారుణమైన ఫ్లాప్. ఇప్పుడు వీరసింహారెడ్డి వంతు వచ్చింది. అందులో బ్రహ్మీ-ఆలీ కాంబినేషన్ లో తీసిన కొద్ది నిమిషాల కామెడీ సీన్ ను బుర్రా సృజించిన తీరు చూస్తే జనం ముక్కున వేలేసుకుంటారు. అంత వెగటు పుట్టించిన కామెడీ సీన్ ఈ మధ్య మరోటి లేదు.
ఇక హరి హర వీరమల్లు..శాకుంతలం సినిమాలు రాబోతున్నాయి. ఇందులో హరి హర వీరమల్లు జానపదం సినిమా. శాకుంతలం పౌరాణికం సినిమా. ఇది కాక పవన్-సాయి తేజ్ ల రీమేక్ ఒకటి వుంది.