పుకార్లకు చెక్ పెట్టిన ఉపాసన కొణెదల

తను తాతను కాబోతున్నట్టు స్వయంగా చిరంజీవి ప్రకటించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు త్వరలోనే బిడ్డ పుట్టబోతున్నాడంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత ఉపాసన ఫొటోలు చూసిన చాలామంది ఆమె…

తను తాతను కాబోతున్నట్టు స్వయంగా చిరంజీవి ప్రకటించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు త్వరలోనే బిడ్డ పుట్టబోతున్నాడంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత ఉపాసన ఫొటోలు చూసిన చాలామంది ఆమె ప్రెగ్నెన్సీపై అనుమానం వ్యక్తం చేశారు.

ఉపాసన గర్భం దాల్చలేదని, సరోగసి ద్వారా అమె బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ ఊహాగానాలు చెలరేగాయి. అదే టైమ్ లో నయనతార సరోగసీ వ్యవహారం కూడా వార్తల్లో నలుగుతుండడంతో, ఉపాసనపై వచ్చిన పుకార్లు మరింత ఎక్కువయ్యాయి.

దీనికితోడు చరణ్ తో కలిసి ఉపాసన దేశవిదేశాలు పర్యటించడం కూడా ఈ కథనాలకు మరింత ఊతమిచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి ఉపాసన ఫుల్ స్టాప్ పెట్టింది. గర్భం కనిపించేలా ఆమె దిగిన ఫొటోలు బయటకొచ్చాయి. స్వయంగా ఉపాసన వాటిని పోస్ట్ చేసింది.

సంక్రాంతి సందర్భంగా కొత్త ఫొటోస్ రిలీజ్ చేసింది ఉపాసన. మాతృత్వాన్ని ఆస్వాదించడం, ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఈ సంక్రాంతి సెలబ్రేషన్ అంటూ ఆమె క్యాప్షన్ కూడా ఇచ్చారు. అలా తన ప్రెగ్నెన్సీపై ఇన్నాళ్లూ చెలరేగిన ఉహాగానాలకు ఆమె ఫుల్ స్టాప్ పెట్టారు.

తరుణ్ తహిల్యాని డిజైన్ చేసిన కాస్ట్యూమ్ లో ఉపాసన అందంగా కనిపించారు. కేసీ డైమండ్స్ జ్యూయలరీని ఆమె ధరించగా, అనైత ష్రాఫ్ స్టయిలింగ్ చేశారు.

Click Here For Photo Gallery