కొత్త ఏడాదిలో స్పీడ్ పెంచిన నెట్ ఫ్లిక్స్

తెలుగులో ఓటీటీ అంటే అమెజాన్ ప్రైమ్ మాత్రమే. టాలీవుడ్ నుంచి ఎక్కువగా సినిమాల్ని స్ట్రీమింగ్ చేసేది ఈ సంస్థ ఒక్కటే. ఆ తర్వాత స్థానాల్లో ఆహా, జీ5, హాట్ స్టార్ లాంటివి ఉన్నాయి. ఈ…

తెలుగులో ఓటీటీ అంటే అమెజాన్ ప్రైమ్ మాత్రమే. టాలీవుడ్ నుంచి ఎక్కువగా సినిమాల్ని స్ట్రీమింగ్ చేసేది ఈ సంస్థ ఒక్కటే. ఆ తర్వాత స్థానాల్లో ఆహా, జీ5, హాట్ స్టార్ లాంటివి ఉన్నాయి. ఈ రేసులో నెట్ ఫ్లిక్స్ మొదట్నుంచి కాస్త జోరు తక్కువే. ఆ సంస్థ లెక్కలు వేరు, వాళ్ల వ్యూహాలు వేరు.

అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. నెట్ ఫ్లిక్స్ కూడా స్పీడ్ పెంచింది. తెలుగుతో పాటు టోటల్ సౌత్ లో ఈ సినిమా మరింతగా చొచ్చుకుపోతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది టాలీవుడ్ లో రాబోతున్న కొన్ని క్రేజీ మూవీస్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇందులో మహేష్-త్రివిక్రమ్ సినిమా కూడా ఉంది.

ఇంకా సెట్స్ పైకి రాని మహేష్-త్రివిక్రమ్ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. హిందీతో పాటు టోటల్ సౌత్ స్ట్రీమింగ్ రైట్స్ అన్నీ ఈ సంస్థ వశమయ్యాయి. ఈ మూవీతో పాటు చిరంజీవి భోళాశంకర్, నాని దసరా సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ కే వెళ్లాయి.
 
అమిగోస్, బుట్టబొమ్మ, టిల్లూ స్క్ర్వేర్, విరూపాక్ష… ఇలా మొత్తంగా 16 అప్ కమింగ్ సినిమాల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయంలో చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా చూడట్లేదు ఈ కంపెనీ. క్రేజ్ ఉందనిపిస్తే చాలు కొని పడేస్తోంది. నెట్ ఫ్లిక్స్ దూకుడుతో మరోసారి ఓటీటీ స్పేస్ లో పోటీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈమధ్య అమెజాన్ ప్రైమ్ సంస్థ సెలక్టివ్ గా సినిమాలు తీసుకుంటోంది. జీ5, హాట్ స్టార్ సంగతి సరేసరి. ఇలాంటి పరిస్థితుల్లో నెట్ ఫ్లిక్స్ దూకుడు పెంచడంతో మిగతా ఓటీటీలన్నీ మరోసారి యాక్టివ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అదే కనుక జరిగితే మరోసారి టాలీవుడ్ లో నిర్మాతలకు పండగే.