పెట్టుడు పన్ను మింగేశాడు, ప్రమాదం తెచ్చుకున్నాడు

పెట్టుడు పళ్లతో అందం సంగతి దేవుడెరుగు, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. దీనికి తాజా ఉదాహరణే ఈ ఘటన. ప్రాణం పోలేదు కానీ, పోయినంత పనైంది. పెట్టుడు పన్ను మింగేసిన ఓ వ్యక్తి ప్రాణాపాయ…

పెట్టుడు పళ్లతో అందం సంగతి దేవుడెరుగు, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. దీనికి తాజా ఉదాహరణే ఈ ఘటన. ప్రాణం పోలేదు కానీ, పోయినంత పనైంది. పెట్టుడు పన్ను మింగేసిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకుని, చివరకు డాక్టర్ల చలవతో బతికి బయటపడ్డాడు. ఈ ఘటన బీహార్ లోని బెగుసరాయ్ లో జరిగింది.

బీహార్ లోన బెగుసరాయ్ కి చెందిన 45 ఏళ్ల సురేంద్ర కుమార్ అనే వ్యక్తి దవడపై ఓ కృత్రిమ పన్ను పెట్టించుకున్నాడు. కొన్నిరోజులు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. పన్ను కదులుతుండే సరికి లైట్ తీసుకున్నాడు సురేంద్ర. ఓరోజు భోజనం చేస్తుండగా.. నోట్లోకి ఏదో వెళ్లినట్టనిపించింది. ఆ తర్వాత అర్థమైంది ఏందంటే.. ఆ పెట్టుడు పన్నుని సురేంద్ర మింగేశాడు.

అది నేరుగా ఆహార నాళాన్ని చీల్చుకుంటూ లోపలికి వెళ్లింది. మిత్రుల సలహాతో బాగా మంచినీళ్లు తాగాడు. ఆ పన్ను అక్కడినుంచి పోయి గుండె, ఊపురితిత్తుల మధ్య ఇరుక్కుపోయింది. ఆ తర్వాత ఇబ్బంది మొదలైంది. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. రోజురోజుకీ అతని పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రాణం పోయినట్టయింది. ఆస్పత్రికి తీసుకెళ్తే ఐసీయూలో పెట్టారు.

ఊపిరితిత్తులకు మధ్యలో ఇరుక్కుపోయిన ఆ పన్నుని తీసేందుకు డాక్టర్లు 6 గంటలపాటు శ్రమించారు. క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించి పన్ను తీసేశారు. మామూలుగా పన్ను ఊడదీయడం చాలా సింపుల్. కానీ ఆ పన్ను ఊపిరితిత్తుల మధ్య కాపురం పెట్టేసరికి దాన్ని తీయడానికి డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. పాట్నాలోన పరాస్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ పూర్తయింది. ఏడుగురు వైద్యులు కష్టపడి ఆపరేషన్ పూర్తి చేసి, అతడికి కొత్త జీవితాన్నిచ్చారు.