ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేదు!

ఆర్టీసీ సమ్మె విషయంలో ఇప్పటికీ ఇరుపక్షాలూ ఏమాత్రం తగ్గడం లేదు. హైకోర్టు కూడా దాదాపుగా చేతులెత్తేసినట్టేనా.. అనిపిస్తోంది. మ  మాట వినడం లేదు. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో ఒక కమిటీ వేస్తాం అని…

ఆర్టీసీ సమ్మె విషయంలో ఇప్పటికీ ఇరుపక్షాలూ ఏమాత్రం తగ్గడం లేదు. హైకోర్టు కూడా దాదాపుగా చేతులెత్తేసినట్టేనా.. అనిపిస్తోంది. మ  మాట వినడం లేదు. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో ఒక కమిటీ వేస్తాం అని మాత్రమే హైకోర్టు ప్రకటించింది.

ఈ కమిటీ అంటూ ఏర్పాటు అయితే గనుక.. తాము ఏం జవాబు చెప్పాలనే విషయంలో ప్రభుత్వం కూడా వాదనలు సిద్ధం చేసుకుంటూ ఉంది. ప్రెవేటు ఆపరేటర్లకు రూటుపర్మిట్లు ఇవ్వడం ఎలా సమంజసమో కోర్టుకు వివరించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

కోర్టు చెబుతున్న ప్రకారం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయడం అనేది సమస్యకు పరిష్కారం అవుతుందా అనే విషయంలో మాత్రం పలువురిలో సందేహాలు ఇంకా ఉన్నాయి. కమిటీ తమ నిర్ణయాన్ని ప్రకటించిన.. 24 గంటల్లోగా విధుల్లో చేరిపోతాం అంటూ యూనియన్ల నాయకులు.. ప్రస్తుతానికి హామీ ఇస్తున్నారు.

కానీ.. ఇరుపక్షాల్లో ఏ ఒక్కరూ కూడా ఏ కొంతైనా రాజీ పడని వాతావరణమే కనిపిస్తోంది. ప్రభుత్వం ఎంతసేపూ  ప్రత్యమ్నాయ మార్గాలు చూడడమూ.. ప్రెవేటు ఆపరేటర్లకు రూట్లను అప్పగించేయడం మీదనే దృష్టి పెడుతోంది. దానివలన కొన్ని ప్రధాన రూట్లలో సమస్య తీరుతుందే తప్ప.. మారుమూల ప్రాంతాల ప్రజలకు సౌకర్యం కలుగుతుందని అనుకోవడానికి వీల్లేదు. చివరికి ఆ రూట్లు మాత్రమే.. ఆర్టీసీకి మిగిలాయంటే గనుక.. ఇక నష్టాల్లోంచి కోలుకోవడం కూడా జరగదు.

విలీనం అనే మాట మీద ఏమాత్రం రాజీ పడకుండా.. ఉద్యోగ సంఘాలు భీష్మించుకు కూర్చున్నాయి. ప్రభుత్వం కూడా ఆ విషయంలో కుదరదని చాలా గట్టిగానే ఉంది. ఇన్ని రోజులుగా సమ్మెవలన ఏర్పడిన రవాణా కష్టాలకు ప్రజలు కూడా అలవాటు పడిపోతున్నారు. మరికొన్నిరోజులు సమ్మె కొనసాగిందంటే గనుక.. ఇంకో ఏడాది సమ్మెలో ఉన్నా ప్రజలు దానిని గురించి బాధపడడం మానేస్తారనిపిస్తోంది.