మహేష్ త్రివిక్రమ్ మూడోసారి?

మహేష్‌బాబుతో త్రివిక్రమ్ కాంబినేషన్ ఫాన్స్‌కి నిజంగా స్పెషల్. అతడు సినిమా బాక్సాఫీస్ వద్ద సోసో అనిపించుకున్నా కానీ టీవీలో దానిని మించిన బ్లాక్‌బస్టర్ లేదంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో మహేష్‌కి వున్న ఇమేజ్‌కి టైలర్‌మేడ్…

మహేష్‌బాబుతో త్రివిక్రమ్ కాంబినేషన్ ఫాన్స్‌కి నిజంగా స్పెషల్. అతడు సినిమా బాక్సాఫీస్ వద్ద సోసో అనిపించుకున్నా కానీ టీవీలో దానిని మించిన బ్లాక్‌బస్టర్ లేదంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో మహేష్‌కి వున్న ఇమేజ్‌కి టైలర్‌మేడ్ క్యారెక్టర్ రాసి, తన మాటలు, దర్శకత్వ ప్రతిభతో ఒక క్లాసిక్‌గా త్రివిక్రమ్ ‘అతడు’ తీర్చిదిద్దాడు.

ఆ తర్వాత ‘ఖలేజా’లో అంతవరకు ఎప్పుడూ చూడని మహేష్‌ని చూపించి ఆశ్చర్యపరిచాడు. ఖలేజా బాక్సాఫీస్ వద్ద ఫెయిలయినా కానీ అదో కల్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం వున్నా కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ కలిసి పని చేయలేదు. సంక్రాంతికి వీరిద్దరి సినిమాలు పోటీ పడడంతో మహేష్ అభిమానులు ఒకింత త్రివిక్రమ్‌కి యాంటీగా వున్నారు.

అయితే ఈ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్స్ బిజీగా వుండడంతో మహేష్ ప్రస్తుతం యువ దర్శకులతో పని చేస్తున్నాడు. ఒకవేళ త్రివిక్రమ్‌కి ఖాళీ వున్నట్టయితే మహేష్ అతనితో సినిమా చేయడానికి సిద్ధంగా వున్నాడు. ఎన్టీఆర్‌తో అనుకున్న సినిమా లేట్ అయ్యేలా వుంది కనుక ఈలోగా మహేష్‌తో వేగంగా ఒక సినిమా పూర్తి చేసేయాలని త్రివిక్రమ్ ప్లాన్ అని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఇద్దరి మధ్య మీటింగ్ కూడా జరగనుందట.