బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ భద్రతపై బీజేపీ ఆందోళన చెందుతోంది. బాలీవుడ్‌కు డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నా యనే విషయమై అనేక సార్లు చర్చ జరిగింది. ఈ సమస్య ఎప్పటికీ సజీవంగా ఉంటోంది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కు డ్రగ్ మాఫియాతో ఉన్న సంబంధాలపై హీరోయిన్ కంగనా రనౌత్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని బీజేపీ అనుమానిస్తోంది.
కంగనాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే రక్షణ కల్పించకపోవడంలో ఆంతర్యం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
బాలీవుడ్‌కు డ్రగ్ మాఫియాతో సంబంధాలను నిరూపిస్తానని ఆమె నాలుగు రోజుల క్రితం ప్రకటించారని, ఇంత వరకూ ఆమెకు రక్షణ కల్పించకపోవడం దురదృష్టకరమని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో బీజేపీ నేత రామ్ కదం ఆవేదన వ్యక్తం చేశారు.
కంగనా నోరు తెరిస్తే పెద్దల బాగోతం బయటపడుతుందని భయం పట్టుకుందా అని ప్రశ్నించారు. డ్రగ్ మాఫియాతో రాజకీయ అక్రమ సంబంధాలు బయటపడతాయనే ప్రభుత్వం భయపడుతోందా అని ఆ లేఖలో బీజేపీ నేత ప్రశ్నించారు.