వైసీపీ పాలనరాజధాని అంటోంది. మిగిలిన పార్టీలేవీ కనీసం దీని మీద మద్దతు మాట కూడా లేకుండా వ్యవహరిస్తున్నాయి. తెలుగుదేశం తీరు అందరికీ తెలిసిందే. ఆ పార్టీకి అమరావతి ఏకైన రాజధానిగా ఉండాలి.
రేపటి రోజున విశాఖ రాజకీయం ఏమైనా ముందు తమ స్వీయ ప్రయోజనాలే ముఖ్యమని టీడీపీ అనుకుంటోంది. ఇక జనసేన కూడా అమరావతి రాజధాని, రైతులు అనే దాదాపుగా టీడీపీ విధానాన్నే పడికట్టు పదాలుగా వల్లిస్తోంది.
బీజేపీ తీరు చూస్తే రాజధాని మార్పు అంశం రాష్ట్రపరిధిలోనిది అని చెబుతూనే తమకు అమరావతి రైతుల ప్రయోజనాలు ముఖ్యమని అంటోంది. ఆ పార్టీకి చెందిన విశాఖ నాయకులు కూడా పాలనారాజధానికి అనుకూలంగా మాట్లాడడం లేదు.
కాంగ్రెస్, వామపక్షాలు ఎటూ అమరావతి రైతుల ఉద్యమంతోనే ఉంటున్నాయి. మొత్తానికి చూస్తే విశాఖకు రాజధాని వచ్చినా రాకపోయినా కూడా వైసీపీకే రాజకీయంగా ప్లస్ అయ్యేలా సీన్ కనిపిస్తోంది. అమరావతి రాజధాని అంటూ గొంతు చించుకుంటున్న వారు, వారి పార్టీలూ విశాఖలో రేపటి రోజున తాము జనాలకు ఏం చెప్పబోతారన్నది కూడా ఆసక్తికరమే. మొత్తానికి ఉత్తరాంధ్ర రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నది ఇప్పటికైతే ఒక్క వైసీపీయే కనిపిస్తోంది మరి.