డైరక్టర్ల మీద డైరక్టర్ రివ్యూలు

టాలీవుడ్ భలే చిత్రమైనది. ఇక్కడ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. నిర్మాత అంటే నిర్మాతలకు అసూయ…దర్శకుడంటే మరో దర్శకుడికి ఏడుపు..హీరో అంటే మరో హీరోకి కుదరదు. ఆఖరికి కి మీడియాలో కూడా అంతే. మానవనైజం…

టాలీవుడ్ భలే చిత్రమైనది. ఇక్కడ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. నిర్మాత అంటే నిర్మాతలకు అసూయ…దర్శకుడంటే మరో దర్శకుడికి ఏడుపు..హీరో అంటే మరో హీరోకి కుదరదు. ఆఖరికి కి మీడియాలో కూడా అంతే. మానవనైజం అలాంటిది మరి.

కానీ పైకి మాత్రం టాలీవుడ్ లో తెరమీద మాత్రమే కాదు, బయట కూడా అద్భుతంగా నటించేస్తూ వుంటారు. ప్రేమలు ఒలకబోస్తూ వుంటారు. కానీ అసలు రూపాలు సినిమాలు తేడా కొట్టినపుడు బయటకు వస్తాయి. తమ తోటి వాళ్లకు ఫోన్ చేసి విమర్శలు కక్కడం ప్రారంభిస్తారు.

వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్యల విషయంలో ఓ మాస్ డైరక్టర్ ఒకరు ఇలాగే చేస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి విడుదలయిన రోజే తెలుసున్న మిత్రులకు ఫోన్ లు చేసి, అసలు అది కథేనా? అది సినిమానేనా? ఆయన దర్శకుడేనా? ఇలా తన మాటలు విసిరారట. గమ్మత్తేమిటంటే ఈ సినిమా చాలా గ్యాప్ తరువాత తన సినిమా ఎక్కక కిందా మీదా పడుతున్నారు. సరైన కథ చేెయలేకపోతున్నారని టాక్

మర్నాడు వాల్తేర్ వీరయ్య విడుదల కాగానే మెగాస్టార్ డేట్ లు దొరికితే అలాంటి సినిమా తీస్తాడా ఎవరైనా? ఇలా..అలా..అంటూ విమర్శలకు పదును పెట్టారట. చెప్పినంత సేపు విన్నవాళ్లు..కరెక్ట్..కరెక్ట్ అని ఊ కొట్టారు. తరువాత తమ మిత్రులకు ఫోన్ లు చేసి, చూడు ఆ దర్శకుడు ఎలా నోరు పారేసుకుంటున్నాడో అని బుగ్గలు నొక్కుకుంటున్నారు.

టాలీవుడ్ లో అంతే..తొందర పడి నోరు పారేసుకోకూడదు. ఎందుకంటే ఇది చాలా చిన్న ప్రపంచం..తిరిగి తిరిగి మళ్లీ మన దగ్గరకే చేరిపోతాయి.