అంత రీసెర్చ్ చేసింది ఇందుకేనా గోపీ..!

వీరసింహారెడ్డి.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా. పక్కా బాలయ్య మార్క్ మూవీ. ఇంకా చెప్పాలంటే అతడి ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా. కాలితో కారును ఆపడం, వంద మందిని ఒక్కడే నరకడం, పొలిటికల్…

వీరసింహారెడ్డి.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా. పక్కా బాలయ్య మార్క్ మూవీ. ఇంకా చెప్పాలంటే అతడి ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా. కాలితో కారును ఆపడం, వంద మందిని ఒక్కడే నరకడం, పొలిటికల్ డైలాగ్స్ చెప్పడం లాంటి ఫ్యాన్ మూమెంట్స్ పుష్కలం. 

ఇలాంటి సినిమా తీయడానికి పెద్దగా రీసెర్చ్ అక్కర్లేదు. నలుగురు టీమ్ తో కూర్చొని, మంచి డైలాగ్ రైటర్ ను పెట్టుకుంటే 4 రోజుల్లో కథ వండేయొచ్చు. వీరసింహారెడ్డిని చూస్తే ఎవరికైనా ఇది ఓ వారం రోజుల్లో తయారైన కథ అనిపించొచ్చు. అంతకుమించి ఇందులో స్టఫ్ కూడా ఏం లేదు. 

కానీ దర్శకుడు గోపీచంద్ మలినేని మాత్రం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఎంతో రీసెర్చ్ చేశాడు. వందేళ్ల చరిత్ర కలిగిన లైబ్రరీల్ని కూడా సందర్శించాడు. 50 ఏళ్ల నాటి పత్రికలు తిరగేశాడు. అలా ఎంతో కష్టపడి, స్టడీ చేసి, శోధించి, మెటీరియల్ సంపాదించి వీరసింహారెడ్డి కథ రాశాడు.

చెప్పుకోడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. ఇంతోటి దానికి మలినేని చేసిన రీసెర్చ్ ఇదంతా. కట్ చేస్తే, రొటీన్ కథతో తెరకెక్కింది వీరసింహారెడ్డి సినిమా. బాలకృష్ణ పాత సినిమాలు చూసి కథ రాసినట్టుంది. దర్శకుడి రీసెర్చ్ ఎక్కడా కనిపించని పరమ రొటీన్ చిత్రమిది. 

మరి ఇంతోటి దానికి అంత రీసెర్చ్ ఎందుకు చేసినట్టు? గోపీచంద్ మలినేని పరిశోధించి చెప్పిన పాయింట్స్ ను బాలయ్య కాదన్నాడా? లేక రీసెర్ట్ అంతా పూర్తిచేసి, బాలయ్యకు అంత అవసరం లేదన్నట్టు రొటీన్ కథతో మలినేని సినిమా తీశాడా? వాళ్లిద్దరికే తెలియాలి.