“ఐశ్వర్య లక్ష్మి, అర్జున్ దాస్ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.” 2 రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలివి. దీనికి కారణం తాజాగా ఐశ్వర్య లక్ష్మి పెట్టిన ఫొటో. అర్జున్ దాస్ తో కాస్త క్లోజ్ గా కనిపిస్తూ దిగిన ఫొటోను ఆమె స్వయంగా పోస్ట్ చేసింది.
అక్కడితో ఆగలేదు. ఆ ఫొటోకు ఓ లవ్ సింబల్ కూడా తగిలించింది. దీంతో ఐశ్వర్య-అర్జున్ ప్రేమలో ఉన్నారంటూ మీడియా అందుకుంది. మరీ ముఖ్యంగా మలయాళ మీడియా ఈ విషయంపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఎట్టకేలకు దీనిపై ఐశ్వర్య లక్ష్మి స్పందించింది
తను పెట్టిన ఫొటోను చాలామంది అపార్థం చేసుకున్నారంటోంది ఐశ్వర్యలక్ష్మి. అర్జున్ తను కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని, తనపై ఉన్న ఇష్టాన్ని అలా ప్రదర్శించానే తప్ప, ప్రేమ లాంటిదేం కాదని స్పష్టం చేసింది.
సరదాగా తీసుకున్న ఫొటో ఇంత వైరల్ అవుతుందని తను ఊహించలేదని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని ఆమె కోరింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అర్జున్ దాస్ మాత్రం గుంభనంగా ఉన్నాడు.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పాపులర్ అయ్యారు వీళ్లిద్దరూ. తాజాగా మట్టికుస్తీ సినిమాలో నటించింది ఐశ్వర్యలక్ష్మి. అంతకంటే ముందు సత్యదేవ్ తో గాడ్సే సినిమా చేసింది. ఇక అర్జున్ దాస్ గురించి అందరికీ తెలిసిందే. ఖైదీ సినిమాతో తెగ పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం తెలుగులో బుట్టబొమ్మ సినిమా చేస్తున్నాడు.