అభిమన్యుడు కాదు అర్జునుడు

ఒక పక్క కమర్షియల్ సినిమాలు మరోపక్క డిఫరెంట్ మూవీస్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తోంది మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. నిర్మాత నిరంజన్ రెడ్డి పెద్ద సినిమాలతో సమానంగా చిన్న సినిమాలు…

ఒక పక్క కమర్షియల్ సినిమాలు మరోపక్క డిఫరెంట్ మూవీస్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తోంది మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. నిర్మాత నిరంజన్ రెడ్డి పెద్ద సినిమాలతో సమానంగా చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. అలా నిర్మిస్తున్న సినిమానే అర్జున – ఫల్గుణ.  శ్రీ విష్ణు హీరో. 

మనం జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు వెళ్లాల్సిందే. అయితే  కొన్ని ఘటనలు మాత్రం మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. 

ఇదే విషయాన్ని టీజర్‌లో చూపించారు. ‘'నాది కాని కురుక్షేత్రంలో.. నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో సినిమా నేపథ్యం ఏంటో అర్థమవుతోంది. 65  సెకన్ల టీజర్‌లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను చూపించారు.

జగదీష్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ, ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయి. ఎన్ ఎమ్ పాషా సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు.