మారుతి-పక్కా కమర్షియల్ టీజర్

దర్శకుడు మారుతి సీరియస్ గా సినిమా చేసినపుడు ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. సరదాగా ఓ చిన్న సినిమా చేద్దాం, సరదాగా ఓ లైన్ ఎవరికైనా డొనేట్ చేసేద్దాం అనుకున్నపుడే పరాజయాలు పలకరించాయి. Advertisement లేటెస్ట్…

దర్శకుడు మారుతి సీరియస్ గా సినిమా చేసినపుడు ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. సరదాగా ఓ చిన్న సినిమా చేద్దాం, సరదాగా ఓ లైన్ ఎవరికైనా డొనేట్ చేసేద్దాం అనుకున్నపుడే పరాజయాలు పలకరించాయి.

లేటెస్ట్ గా మారుతి చేస్తున్న సీరియస్ సినిమా పక్కా కమర్షియల్. జాలీ ఎల్ ఎల్ బి స్టయిల్ లో హీరో గోపీచంద్ తో చేస్తున్న సినిమా. టైటిల్ కు తగినట్లు పక్కా కమర్షియల్ ప్యాకింగ్ తో టీజర్ ను కట్ చేసి వదిలారు.

ఎవరికి చూపిస్తున్నారు మీ హీరోయిజం, నేను ఎప్పుడో చేసేసా అంటూ హీరో గోపీచంద్ చెప్పే డైలాగుతో ప్రారంభమై, పక్కా కమర్షియలయ్..అంటూ క్లోజ్ అయింది. ఈ మధ్యలో ఫైట్లు, ఫన్, రొమాంటిక్ టచ్, హీరోయిజం అన్నీ ప్యాక్ చేసారు. 

రాశీఖన్నా, రావు రమేష్ డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించారు. ఓపెనింగ్ సీన్ క్రాక్ ను, గొడుగు సీన్ అల వైకుంఠపురం సినిమాలను గుర్తు చేసినా, మొత్తం మీద టీజర్ బాగుంది. సినిమా మీద ఓ అంచనా కలిగేలా చేసింది. యువి, గీతా2 కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.