25 రోజుల్లో కోర్టును కట్టేసారు

సినిమాల కోసం సెట్ లు వేయడం చాలా కామన్. గుణశేఖర్ లాంటి దర్శకులు చార్మినార్, మధుర ఆలయం లాంటి కట్టడాలను మళ్లీ కళ్ల మందుకు తెచ్చారు కూడా.  Advertisement ఒక చారిత్రాత్మక కట్టడాన్ని రీ…

సినిమాల కోసం సెట్ లు వేయడం చాలా కామన్. గుణశేఖర్ లాంటి దర్శకులు చార్మినార్, మధుర ఆలయం లాంటి కట్టడాలను మళ్లీ కళ్ల మందుకు తెచ్చారు కూడా. 

ఒక చారిత్రాత్మక కట్టడాన్ని రీ ప్రొడ్యూస్ చేయడం అంటే అంత సులువు కాదు. పైగా ఫొటొలు తీయడానికి లేకుండా, వీడియో లేకుండా, కొలతలు లేకుండా రీ ప్రొడ్యూస్ చేయడం అంత సులువు కాదు. అలాంటి ఫీట్ నే సక్సెస్ ఫుల్ గా చేసారు జై భీమ్ సినిమా కోసం.

చెన్నయ్ హై కోర్టులోని ఓ హాలును యాజ్ ఇట్ ఈజ్ గా పునర్మించేసారు. అది కూడా జస్ట్ 25 రోజుల్లో. నిజానికి చెన్నయ్ హై కోర్టు అంటే బయట నుంచి గోపురాలు చూపించడమే తప్ప లోపల భాగం చూపించిన సినిమా ఒక్కటీ లేదు. పైగా ఎవర్ని పడితే వారిని కోర్టులోకి రానివ్వరు. సెల్ ఫోన్ లు తీసుకెళ్లనివ్వరు.

జై భీమ్ సినిమా కోసం జస్ట్ చూడడానికి మాత్రం అనుమతి దొరికిందట. అదృష్టం కొద్దీ జస్టిస్ చంద్రు తను వాదించిన, తీర్పుచెప్పిన కేసుల గురించి వివరిస్తూ రాసిన పుస్తకంలో కొన్ని ఫొటోలు వున్నాయట. వాటిని ఆలంబన చేసుకున్నారు. మొత్తం మీద 25 రోజుల్లో ఒక అతి పెద్ద కోర్టు హాల్ ను కళ్ల ముందుకు తీసుకువచ్చేసారు.

తీసుకురావడమే కాదు హైకోర్టు సిబ్బందిని, న్యాయవాదులను కొంత మందిని తీసుకువచ్చి చూపించారట. వాళ్లు ఆశ్చర్యపోయారు. నిజంగా హైకోర్టులోనే వున్న ఫీల్ కలిగిందన్నారట. జస్టిస్ చంద్రు కూడా వచ్చి చూసి, సలహాలు సూచనలు ఇచ్చారట. 

సూర్య కీలక పాత్రలో జ్ఞానవేల్‌ తెరకెక్కించిన కోర్టు రూమ్‌ డ్రామా ‘జై భీమ్‌’.ఇటీవల ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను విమర్శకులను సైతం మెప్పించింది.