అఖండ..బోయపాటి ఏదో చేస్తున్నారు

అఖండ సినిమా నుంచి తొలి పాట వచ్చింది. సినిమాలో అఘోరా క్యారెక్టర్ లో హీరో బాలయ్య కనిపిస్తారని మొదటి నుంచీ వార్తలు వున్నాయి. Advertisement ఇప్పుడు అదే నిజమైంది. ఇప్పుడు వచ్చిన తొలిసాంగ్ లిరిక్స్ శివుడి…

అఖండ సినిమా నుంచి తొలి పాట వచ్చింది. సినిమాలో అఘోరా క్యారెక్టర్ లో హీరో బాలయ్య కనిపిస్తారని మొదటి నుంచీ వార్తలు వున్నాయి.

ఇప్పుడు అదే నిజమైంది. ఇప్పుడు వచ్చిన తొలిసాంగ్ లిరిక్స్ శివుడి బ్యాక్ డ్రాప్ లో వున్నాయి. థమన్ చేసిన ట్యూన్ ఏమంత క్యాచీగా లేదు.

అలా అని బీట్ కీలకంగా, ఎమోషనల్ గా కూడా లేదు. సినిమాలో చిత్రీకరణ మీద బాగుండే అవకాశం వుంటే వుండొచ్చు. ప్రస్తుతానికి అయితే వైరల్ అయిపోయే రేంజ్ లో అయితే లేదు.

బోయపాటి డైరక్షన్ లో తయారవుతున్న అఖండ సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. డిసెంబర్ లో విడుదలయ్యే ఈ సినిమా కోసం దాదాపు 70 కోట్లకు పైగా ఖర్చు చేసారు. సినిమాను యాభై అరవై కోట్ల మేరకు మార్కెట్ చేసారు. సినిమాలో బాలయ్య ఎప్పటి లాగే డ్యూయల్ షేడ్ లో కనిపిస్తారు.