ఈ రోజే చైతన్య ‘థాంక్ యూ’

ఎప్పటి నుంచో అనుకుంటున్న సినిమా 'థాంక్ యూ' అఫీషియల్ ప్రకటన ఈ రోజు వస్తోంది. నాగ్ చైతన్య హీరోగా నిర్మాత దిల్ రాజు నిర్మించే విక్రమ్ కే కుమార్ డైరక్షన్ సినిమా ను ఈ…

ఎప్పటి నుంచో అనుకుంటున్న సినిమా 'థాంక్ యూ' అఫీషియల్ ప్రకటన ఈ రోజు వస్తోంది. నాగ్ చైతన్య హీరోగా నిర్మాత దిల్ రాజు నిర్మించే విక్రమ్ కే కుమార్ డైరక్షన్ సినిమా ను ఈ రోజు అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఈ సినిమాకు ముందుగా వినిపిస్తున్నట్లే థాంక్యూ అనే టైటిల్ పెట్టారు. 

ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో బివిఎస్ రవి తయారు చేసిన మూల కథను విక్రమ్ కే కుమార్ తన స్టయిల్ లోకి మార్చుకున్నారు. జీవితంలో తనకు సాయం చేసిన వారందరినీ గుర్తు తెచ్చుకుని, వెదికి వెదికి మరీ థాంక్స్ చెప్పడం అనేలాంటి లైన్ ఏదో వుంది ఈ సినిమాకు అని వినిపిస్తోంది. 

నాగార్జున బర్డ్ డే సందర్భంగా ఆయనతో గత ఇరవై ఏళ్లుగా అసోసియేట్ అయినందుకు దిల్ రాజు, మనం సినిమా అందించే చాన్స్ ఇచ్చినందుకు విక్రమ్ కుమార్, తనకు రీల్ హీరో, రియల్ హీరోగా నిలిచినందుకు చైతన్య, ఇలా ముగ్గురూ థాంక్స్ చెబుతూ ఈ పోస్టర్ ను, ప్రకటనను ఈ రోజు 11 గంటలకు అనౌన్స్ చేయబొతున్నారు. 

ఎవరినీ వదిలి పెట్టను