‘లవ్ స్టోరీ’ కి పున:పూజ

ఒక సారి పూజ చేసి, మళ్లీ రెండోసారి చేస్తే దాన్నే పున: పూజ అంటారు. కరోనా పుణ్యమా అని చైతన్య-సాయిపల్లవి కాంబినేషన్ లో ఆసియన్ సునీల్ ఫ్యామిలీ నిర్మించే లవ్ స్టోరీ సినిమాకు ఇదే…

ఒక సారి పూజ చేసి, మళ్లీ రెండోసారి చేస్తే దాన్నే పున: పూజ అంటారు. కరోనా పుణ్యమా అని చైతన్య-సాయిపల్లవి కాంబినేషన్ లో ఆసియన్ సునీల్ ఫ్యామిలీ నిర్మించే లవ్ స్టోరీ సినిమాకు ఇదే జరుగుతోంది. సినిమా ఈసారి అయినా నిర్విఘ్నంగా షూటింగ్ జరుపుకోవాలని పూజ చేయబోతున్నారు. పూజ చేసి, వచ్చే నెల 7 నుంచి షూట్ చేయాలని ప్లాన్ చేసారు. ఈ పూజా కార్యక్రమం 31న ఆఫీసులో వుంటుంది. 

కరోనా లేకపోయి వుంటే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాను డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా అందించాలని నిర్మాత సునీల్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే నాగార్జున బర్డ్ డే సందర్భంగా సినిమానుంచి ఓ కొత్త స్టిల్ ను పోస్టర్ చేసి వదిలారు. పోస్టర్ విడుదల సందర్భంగా ఆసియన్ సునీల్ మాట్లాడుతూ, షూటింగ్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ముందుగానే పరిక్షలు, క్వారంటైన్ ఏర్పాట్లు చేసి, షూటింగ్ నుంచి బయటకు వెళ్లకుండా, అక్కడే వుండేలా ఏర్పాట్లు కూడా చేసామని వెల్లడించారు.

ఎవరినీ వదిలి పెట్టను