షాకింగ్.. దొంగతనాలకు ‘ర్యాపిడో’

అటో, ఇటో, ఎటో.. ఎక్కెయ్ రాపిడో అంటూ అల్లు అర్జున్ అడ్వర్టైజ్ మెంట్ ఇస్తే ఏంటో అనుకున్నాం. ఇప్పుడు ర్యాపిడో బండ్లు మరో పనికి కూడా ఉపయోగపడుతున్నాయని తెలుసుకుని కస్టమర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ర్యాపిడో…

అటో, ఇటో, ఎటో.. ఎక్కెయ్ రాపిడో అంటూ అల్లు అర్జున్ అడ్వర్టైజ్ మెంట్ ఇస్తే ఏంటో అనుకున్నాం. ఇప్పుడు ర్యాపిడో బండ్లు మరో పనికి కూడా ఉపయోగపడుతున్నాయని తెలుసుకుని కస్టమర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ర్యాపిడో ఎక్కడానికే కాదు, మెడలో గొలుసులు తెంపడానికి కూడా ఉపయోగపడుతుందని తెలిసి షాకయ్యారు బెంగళూరు పోలీసులు. ర్యాపిడో డ్రైవర్ ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. రెండున్నర లక్షల విలువైన బంగారం, బండిని సీజ్ చేశారు.

ర్యాపిడో డ్రైవర్.. సహజంగా ఎవరైనా పార్ట్ టైమ్ ర్యాపిడో డ్రైవర్లుగా పనిచేస్తుంటారు. కానీ మనోడు ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తూ పార్ట్ టైమ్ దొంగతనాలు చేయడం మొదలెట్టాడు. అర్థరాత్రి, అపరాత్రయినా ర్యాపిడో బండి, బండిపై హెల్మెట్ పెట్టుకుని వెళ్లేవారిని ఎవరూ అనుమానించరు. అదే అతనికి అడ్వాంటేజ్ అయింది. తెల్లవారు ఝామున హెల్మెట్ పెట్టుకుని ఎంచక్కా కాలనీలలోకి వస్తుంటాడు. ఒంటరిగా కనపడిన మహిళల మెడలోనుంచి బంగారు చైన్లు లాగేసుకుని వెళ్తుంటాడు. ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో పోలీసులు నిఘా పెట్టారు. ఎట్టకేలకు ఆ 'ర్యాపిడో దొంగ' ని పట్టుకున్నారు.

సదరు డ్రైవర్ బీసీఏ గ్రాడ్యుయేట్ అని తెలిసుకుని షాకయ్యారు పోలీసులు. ఓ చిన్న హోటల్ ని అతను స్టార్టప్ గా రన్ చేస్తున్నాడు. ర్యాపిడో డ్రైవర్ గా కూడా పనిచేస్తున్నాడు. ఈ ఆదాయం సరిపోక ఇలా గొలుసు దొంగగా మారాడు. సహజంగా ర్యాపిడో డ్రైవర్లుగా ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలంటే సవాలక్ష కండిషన్లు పెడుతుంది యాజమాన్యం. ఇతడికి నేర చరిత్ర ఏమీ లేకపోవడంతో హ్యాపీగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఇలా తప్పుడు పనులు మొదలు పెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.

ఇన్నాళ్లూ ర్యాపిడో బైకులు ఎత్తుకెళ్లేవాళ్లను చూశాం, కానీ ఇతడు ఏకంగా ఆ బైకులతో దొంగతనాలు షురూ చేశాడు.