బాబు అహంకారమే అనుమతులకు అడ్డుపడిందా?

కుప్పంలో చంద్రబాబు నాయుడు సభలకు పోలీసులు అనుమతి నిరాకరించారా? లేదా, పోలీసులు అనుమతి నిరాకరించేలాగా చంద్రబాబునాయుడే ఒక వ్యూహం ప్రకారం ఎగస్ట్రాలు చేశారా? అనే చర్చ ఇప్పుడు మొదలవుతోంది.  Advertisement ఎందుకంటే.. జీవో నెం.1…

కుప్పంలో చంద్రబాబు నాయుడు సభలకు పోలీసులు అనుమతి నిరాకరించారా? లేదా, పోలీసులు అనుమతి నిరాకరించేలాగా చంద్రబాబునాయుడే ఒక వ్యూహం ప్రకారం ఎగస్ట్రాలు చేశారా? అనే చర్చ ఇప్పుడు మొదలవుతోంది. 

ఎందుకంటే.. జీవో నెం.1 గురించి రాష్ట్ర ఎడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పూర్తి వివరాలు తెలియజేస్తూ.. ఈ జీవో ద్వారా సభలను, రోడ్ షోలను నిషేధించడం అనేది అబద్ధం అని, ఆ జీవోలో ఉండే అంశాల గురించి కూలంకషంగా వివరణ ఇచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు తీరు మీదనే అనుమానాలు కలుగుతున్నాయి. 

రవిశంకర్ అయ్యన్నార్ కుప్పంలో జరిగిన బాగోతంపై చాలా స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు సభలకోసం పోలీసు అనుమతుల కోసం దరఖాస్తు చేసిన స్థానిక నాయకులు.. ఆ దరఖాస్తును సరిగా నింపనేలేదు. ఆ దరఖాస్తును సరిగా నింపి మళ్లీ తీసుకురావాలని పోలీసులు కోరినప్పుడు స్పందించలేదు. రెండు అంశాల్లో వివరణ కోరితే.. దానికి జవాబే ఇవ్వలేదు. వివరణ అడిగినప్పుడు జవాబు ఇవ్వకపోతే.. అనుమతి గురించి డిమాండ్ చేయడంలో ఏం సహేతుకత ఉంటుంది? చంద్రబాబు నాయుడు చేసిన గోలలో మరుగున పడిపోయిన ఈ అంశాలన్నిటినీ.. రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా బయటపెట్టారు. 

చూడబోతే చంద్రబాబునాయుడు చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్టు కనిపిస్తోంది. పోలీసులు అడిగిన అంశాలకు వివరణ ఇవ్వకుండా అహంకారం ప్రదర్శించారు. దాంతో అనుమతులు రాలేదు. ఆయన కోరిక కూడా అదే. అనుమతులు రాకపోతే.. తన సభలకు ప్రభుత్వం అడ్డుపడుతున్నదని, తనను చూసి భయపడుతున్నదని, తన గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నదని గోల చేయాలనేది ఆయన కోరిక. ఆ కోరికతోనే ఆయన సభలకోసం దరఖాస్తు కూడా సవ్యంగా చేయలేదు. అనుమతి తిరస్కరించగానే ఇక గోల ప్రారంభించారు. దానిని ఆధారం చేసుకుని.. పవన్ కల్యాణ్ తో మంతనాలు సాగించారు. పొత్తువ్యూహాలు మాట్లాడుకున్నారు. 

నిజానికి అదంతా వాళ్ల ఇష్టం. కానీ.. రెండు పార్టీల నాయకులు కలవడానికి కూడా భయపడుతున్నారంటే.. కుంటిసాకులు వెతుక్కుంటున్నారంటే.. ప్రభుత్వం మీద నింద వేసి.. సంఘీభావం ముసుగులో వక్ర వ్యూహరచన చేస్తున్నారంటే.. వారి కలయికల్లో కేవలం దుర్బుద్ధులు మాత్రమే ఉన్నాయని ఎవరికైనా అర్థమవుతుంది. కుప్పం ఎపిసోడ్ లో కేవలం చంద్రబాబునాయుడే అనుమతులు రాకుండా జాగ్రత్త పడ్డారని ప్రజలకు అనిపిస్తోంది.