టాలీవుడ్ లో మరో పెళ్లి.. రేపే యంగ్ హీరో వివాహం

టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరుగా వైవాహిక జీవితంలోకి ఎంటర్ అవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో హీరో చేరాడు. అతడి పేరు త్రిగుణ్ అలియాస్ అరుణ్ అదిత్. Advertisement నివేదిత అనే అమ్మాయని పెళ్లాడబోతున్నాడు…

టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరుగా వైవాహిక జీవితంలోకి ఎంటర్ అవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో హీరో చేరాడు. అతడి పేరు త్రిగుణ్ అలియాస్ అరుణ్ అదిత్.

నివేదిత అనే అమ్మాయని పెళ్లాడబోతున్నాడు త్రిగుణ్. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లిగా తెలుస్తోంది. వీళ్ల వివాహానికి సంబంధించి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఈరోజు జరుగుతున్నాయి. రేపు వివాహం జరుగుతుంది. తమిళనాడులోని తిరువూర్ లో పెళ్లి చేసుకుంటున్నాడు త్రిగుణ్.

కథ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు త్రిగుణ్. ఆ తర్వాత గరుడవేగ, డియర్ మేఘ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ప్రేమదేశం అనే సినిమాలో కూడా నటించాడు.

అయితే వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు ఈ హీరో. అందుకే గతేడాది తన పేరును అరుణ్ అదిత్ నుంచి త్రిగుణ్ గా మార్చుకున్నాడు. అలా మారిన పేరుతో వర్మ దర్శకత్వంలో కొండా అనే సినిమా చేశాడు.

ప్రస్తుతం చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్నాడు త్రిగుణ్. ఇతడి చేతిలో పలు తెలుగు-తమిళ సినిమాలున్నాయి. పెళ్లి తర్వాత అతడి కెరీర్ కొత్త మలుపు తిరగాలని ఆశిద్దాం..