క్రికెటర్ విరాట్ కోహ్లి, హీరోయిన్ అనుష్క శర్మ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఈ దంపతులు స్వయంగా వెల్లడించారు. “ఇప్పుడు మేం ముగ్గురం, జనవరి 2012న వస్తున్నాడు” అనే సందేశంతో అనుష్క శర్మ.. తను ప్రెగ్మెంట్ అనే విషయాన్ని బయటపెట్టింది.
అనుష్క శర్మ ప్రెగ్మెంట్ అయిందంటూ గడిచిన 2 నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్ని నెలలుగా అనుష్క బయటకు రాకపోవడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. లాక్ డౌన్ కావడంతో ఆమె బయటకు రాలేదని కొందరు అనుకున్నప్పటికీ.. ఎక్కువమంది మాత్రం ఆమె ప్రెగ్మెంట్ అయిందనే విషయాన్నే కన్ ఫర్మ్ చేశారు. ఎట్టకేలకు ఈ విషయాన్ని అనుష్క శర్మ బయటపెట్టింది. 4 నెలల గర్భంతో దిగిన తన లేటెస్ట్ ఫొటోను కూడా షేర్ చేసింది.
చాన్నాళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారు అనుష్క-విరాట్. ఓ దశలో వాళ్ల రిలేషన్ షిప్ తెగిపోయిందని కూడా వార్తలొచ్చాయి. అలా కొన్నేళ్ల పాటు వార్తల్లో నిలిచిన ఈ జంట.. 2017 డిసెంబర్ లో ఇటలీలో పెళ్లి చేసుకుంది. అలా పెళ్లయిన రెండేళ్లకు ఈ జంట ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది.
షారూక్ తో చేసిన జీరో మూవీ తర్వాత మళ్లీ మరో సినిమా చేయలేదు అనుష్క శర్మ. అయినప్పటికీ నిర్మాతగా ఆమె ఫుల్ బిజీగా ఉంది. పాతాళ్ లోక్, బుల్ బుల్ లాంటి వెబ్ సిరీస్ నిర్మించింది. ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనిస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది