మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గీత రచయిత అయిపోయారు. గతంలో ఆయన సినిమాల్లో పాటలకు కూడా ఆయన మాట చేయడం మామూలే.
ఆయన మాటలు చాలా పాటలుగా మారాయి. కానీ ఆ క్రెడిట్ అంతా ఆయా పాటల రచయితలకే వెళ్లింది. అయితే తొలిసారి పాటల రచయితగా త్రివిక్రమ్ పేరు టైటిల్ కార్డ్స్ లో కనిపించబోతోంది.
లాలా..బీమ్లా..అంటూ సాగే టైటిల్ సాంగ్ ను తివిక్రమ్ రాసారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఆ పాటను విడుదల చేసారు. అన్నపూర్ణలో భారీగా చిత్రీకరించిన కవర్ సాంగ్ కు కొన్ని సినిమా విజువల్స్ మిక్స్ చేసి పాటను విడుదల చేసారు. ఒరిస్సా నుంచి రప్పించిన ముఫై మంది నృత్య మహిళా కళాకారులు ఈ షూట్ లో పాల్గొన్నారు.
హీరో పవన్ పాత్ర అయిన భీమ్లా నాయక్ ను హైలైట్ చేస్తూ సాగే ఈ పాటను త్రివిక్రమ్ రాసారు. మాంచి మాస్ బీట్ ట్యూన్ ను, అలాగే డ్రమ్స్ ఇంటర్ లూడ్ ను థమన్ అందించారు.