పవన్ కల్యాణ్ పుట్టినరోజంటే, అతడి సినిమాల నుంచి ఓ రేంజ్ లో హంగామా ఉంటుంది. అలాంటి హంగామా ఈరోజు ఓజీ సినిమా నుంచి కనిపించింది. ఓజీ సినిమా నుంచి స్టయిలిష్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. మరి కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు సినిమా పరిస్థితేంటి?
పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా వీరమల్లు నుంచి కేవలం ఓ పోస్టరు మాత్రమే వచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రావాల్సిన ప్రమోషనల్ మెటీరియల్ చాలా వచ్చేసింది. బరిలో పవన్ కల్యాణ్, ఉస్తాదుల్ని మట్టికరిపించే వీడియో ఆల్రెడీ చూసేశాం. రౌద్రంతో ఉన్న పోస్టర్లు కూడా చూసేశాం. దీంతో ఈసారి పుట్టినరోజు శుభాకాంక్షల్ని కేవలం పోస్టర్ కు మాత్రమే పరిచయం చేశారు.
తృటిలో మిస్సయిన గ్లింప్స్…
నిజానికి హరిహర వీరమల్లు నుంచి కూడా గ్లింప్స్ రెడీ చేద్దాం అనుకున్నారు. దానికి సంబంధించి డిస్కషన్ కూడా జరిగింది. మొఘల్ కాలంలో ఓడ రేవు.. సముద్రం ఒడ్డున లంగర్ వేసిన నౌక.. అందులో అపారమైన నిధులు.. ఆ నౌకపై వీరమల్లు దాడి చేస్తాడు.. గస్తీ నుంచి తప్పించుకొని మరీ తనకు కావాల్సింది దోచుకుపోతాడు. ఆ సందర్భంలో కాస్త చమక్కు, ఇంకాస్త యాక్షన్ తో కూడిన ఎపిసోడ్ ఒకటి వస్తుంది. ఆ ఎపిసోడ్ నుంచి ఓ 40 సెకెన్ల వీడియోను గ్లింప్స్ గా విడుదల చేద్దామని ప్రాధమికంగా అనుకున్నారు.
కానీ పవన్ కల్యాణ్ ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మొన్నటివరకు బ్రో సినిమాకు కాల్షీట్లు ఇచ్చిన ఆయన, ఇప్పుడు ఓజీకి, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కు కాల్షీట్లు ఇస్తున్నాడు. దీంతో హరిహర వీరమల్లు సినిమా ఎప్పటికప్పుడు ఆలస్యమౌతోంది.
ఇలాంటి టైమ్ లో మరో గ్లింప్స్ రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది కానీ, కాల్షీట్ల కేటాయింపు లేటైతే, సినిమా బాగా పాతబడిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పటికే వీరమల్లు గ్లింప్స్ వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేసిన తర్వాత, మళ్లీ గ్యాప్ వస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే గ్లింప్స్ ఆలోచనను పక్కనపెట్టి, పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది యూనిట్.