ఖుషి మొదటి రోజు ఎంత వచ్చిందంటే..!

విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మెరిసింది. వరల్డ్ వైడ్ 30 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమాకు మొదటి…

విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మెరిసింది. వరల్డ్ వైడ్ 30 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమాకు మొదటి రోజు 23-25 కోట్ల రూపాయల మధ్య వసూళ్లు వస్తాయని ట్రేడ్ భావించింది. కానీ అంచనాల్ని మించి కలెక్షన్ వచ్చింది.

కాస్త ఎక్కువ రన్ టైమ్ తో వచ్చిన ఈ సినిమాలో అక్కడక్కడ ల్యాగ్ ఉందనే విమర్శలు వినిపించాయి. దీనికితోడు ఫస్టాఫ్ మొత్తం ఊహించుకునేట్టు ఉందనే కామెంట్స్ కూడా పడ్డాయి. కాన్ ఫ్లిక్ట్ పాయింట్ కంటే రొమాంటిక్ ట్రాక్ పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు రివ్యూలు వచ్చాయి.

ఓవైపు ఇలాంటి టాక్ నడుస్తున్నప్పటికీ, మరోవైపు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మూవీ ఏ రేంజ్ లో నిలబడుతుందనే విషయం ఈ వీకెండ్ గడిస్తే గానీ చెప్పలేం.

ఖుషి కంటే ముందు లైగర్ సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఖుషితో అతడు ఖుషిగానే ఉన్నాడు. అటు సమంత, శివ నిర్వాణ ముఖాల్లో కూడా ఖుషి కనిపిస్తోంది.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 8లక్షల డాలర్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. మరికొన్ని గంటల్లో ఈ మూవీ మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.