శృంగారం త‌ర్వాత‌.. ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయి!

శృంగారం కోసం త‌ప‌న‌.. దీని గురించి మ‌నిషికి ప్రత్యేకంగా వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. సృష్టి స‌హ‌జం కావొచ్చు, హార్మోన్ల ప్ర‌భావం అని చెప్పుకోవ‌చ్చు.. ఎలాగైతేనేం, శృంగారం మ‌నిషికి ఎన‌లేని ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. తొలి శృంగార అనుభ‌వం పొంద‌డం…

శృంగారం కోసం త‌ప‌న‌.. దీని గురించి మ‌నిషికి ప్రత్యేకంగా వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. సృష్టి స‌హ‌జం కావొచ్చు, హార్మోన్ల ప్ర‌భావం అని చెప్పుకోవ‌చ్చు.. ఎలాగైతేనేం, శృంగారం మ‌నిషికి ఎన‌లేని ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. తొలి శృంగార అనుభ‌వం పొంద‌డం కోసం ఆరాట‌ప‌డే వ‌య‌సు ఉంటుంది. స‌మాజం, కుటుంబం దానికి బోలెడ‌న్ని ప‌రిమితుల‌ను పెట్టిన‌నేప‌థ్యంలో వాటికి విలువ‌ను ఇస్తూనే మ‌నిషి శృంగారం ప‌ట్ల అమితాస‌క్తిని అయితే స‌హ‌జంగానే క‌లిగి ఉంటాడు. మ‌రి ఒక్క‌సారి ఆ అనుభ‌వం అందితే? ఆ అనుభ‌వం రొటీన్ అయితే? అప్పుడెలా ఉంటుంద‌నేది మ‌రో ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం.

వివాహంతోనో, మ‌రో బంధంతోనో శృంగారానుభ‌వాన్ని రెగ్యుల‌ర్ గా పొందే త‌రుణంలో సెక్స్ ప‌ట్ల మ‌నిషిలో మ‌రో ర‌క‌మైన అభిప్రాయం ఏర్ప‌డ‌వ‌చ్చు. ప్ర‌త్యేకించి శృంగార క్రీడ పూర్తైన వెంట‌నే మ‌నిషి సైకాల‌జీ ఎలా ఉంటుంద‌నేది ఒక ప‌రిశోధ‌నాత్మ‌క‌మైన అంశం. దీని గురించి ర‌క‌ర‌కాల మ‌నుషుల అభిప్రాయాల‌ను తీసుకుంది ఒక అధ్య‌య‌న సంస్థ‌. దాని ప్ర‌కారం.. సెక్స్ పూర్త‌యిన వెంట‌నే మ‌నిషి ఆలోచ‌న‌ల్లో చాలా వైరుధ్యం ఉంటుంది! సెక్స్ అనుభ‌వం పొందిన వెంట‌నే వారి మ‌దిలో, మెద‌డులో ర‌క‌ర‌కాల స్పంద‌న‌లు ఉంటాయి. వాటిని విశ‌దీక‌రిస్తే.

ప్ర‌శాంత‌త‌, ఆత్మీయ‌త‌!

శృంగారం అనుభ‌వం పొందిన త‌ర్వాత త‌మ పార్ట్ న‌ర్ తో ఆత్మీయ‌త పెంపొందుతుంద‌ని అనేక మంది చెబుతున్నారు. శృంగారంలో త‌నివితీరా మునిగి తేలిన త‌ర్వాత‌, సెక్స్ ను సంపూర్ణంగా ముగించిన త‌ర్వాత కూడా త‌మ‌కు త‌మ పార్ట్ న‌ర్ స్ప‌ర్శ అంతే ఆనందాన్ని, ఆత్మీయ‌త‌ను ఇస్తుంద‌ని, సెక్స్ త‌ర్వాత తాము పార్ట్ న‌ర్ ను ప్ర‌శాంతంగా పెన‌వేసుకుని ఆత్మీయంగా గ‌డుపుతామ‌ని కొంద‌రు చెప్పారు.

చేయాల్సిన ప‌నులు గుర్తుకొస్తాయి!

మ‌రి కొంద‌రు చెప్పిన మాట సెక్స్ పూర్త‌యిన వెంట‌నే త‌మ‌కు వేరే ప‌నుల‌న్నీ గుర్తుకు వ‌స్తాయ‌ని! ఉద్యోగానికి సంబంధించిన విష‌యాలో, లేక అప్ప‌టికే పెట్టుకున్న ప‌నులు.. ఇవ‌న్నీ గుర్తుకు వ‌స్తాయ‌ట‌! ఒక ర‌కంగా సెక్స్ పూర్తి కాగానే వీరి మెద‌డు పూర్తిగా థింకింగ్ స్పాట్ అయిపోతుంది. పార్ట్ న‌ర్ గురించి కానీ, అప్పుడే పొందిన అనుభ‌వం గురించి ఆలోచించే తత్వం ఉండ‌దు. త‌మ‌కు క్యాజువ‌ల్ రిలేషన్ షిప్పే బెట‌ర్ అనేది వీరి అభిప్రాయం కూడా!

త‌ప్పు చేసిన భావ‌న‌!

శృంగార ఉత్తేజం శ‌రీరంలో ఉన్నంత సేపూ అదో ఉత్సాహం. కోరిక‌ను తీర్చుకోవాల‌నే ఆస‌క్తి విప‌రీతంగా ఉంటుంది. అయితే ఒక్క‌సారి ఆ ఉత్తేజం అంతా పూర్తి కాగానే ఒక ర‌కమైన త‌ప్పుచేసిన భావ‌న త‌మ‌ను చుట్టుముడుతుంద‌ని కొంద‌రు వివ‌రించారు. సెక్స్ అంటే ఒక పాపం అనే భావ‌న వ‌స్తుంద‌ట‌. మూడ్ ఉన్నంత వ‌ర‌కూ ఓకే, అది పూర్తి కాగానే ఈ త‌ప్పుచేసిన భావ‌న మ‌నసును ద‌హించి వేస్తుంద‌ట‌. పెళ్లి కాకుండా సెక్స్ సంబంధాలు, అక్ర‌మ సంబంధాల విష‌యంలో ఈ భావ‌న ఉండ‌వ‌చ్చు. సెక్స్ ప‌ట్ల విప‌రీత ఆస‌క్తితో ఆ ప‌ని చేసినా, పూర్తయిన వెంట‌నే మాత్రం ఈ ప‌రిస్థితి ఉండ‌వ‌చ్చు. ఆ విర‌క్తి కూడా తాత్కాలిక‌మైన‌ది కావొచ్చు!

అంకిత‌మైన ఫీలింగ్!

శృంగారం త‌ర్వాత త‌మ బంధం మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్టుగా భావించే వారూ ఉన్నారు. సెక్స్ పూర్త‌యిన త‌ర్వాత త‌మ బంధం అప్పుడే మొద‌ల‌యిన‌ట్టుగా, మ‌రెంతో ప‌య‌నించే ఆస‌క్తి వీరిలో వ్య‌క్తం అవుతుంద‌ట‌. ఇలా సెక్స్ తో మాన‌సిక‌మైన బంధం కూడా ధృడ‌ప‌డ‌వ‌చ్చు!

శుభ్ర‌త గురించి గుర్తొస్తుంది!

శృంగారానికి ముందు త‌మ పార్ట్ న‌ర్ నీట్ గా ఉన్నారా, స్నానం చేశారా, ప‌ళ్లు తొమ్ముకున్నారా అనే విష‌యాన్ని తాము ప‌ట్టించుకోమ‌ని, అయితే శృంగారకాండ పూర్త‌యిన త‌ర్వాత ఇలాంటి ఆలోచ‌న‌లు వ‌స్తాయ‌ని మ‌రి కొంద‌రు సెల‌విచ్చారు. స్నానం, నోటి నుంచి వ‌చ్చే స్మెల్ వీటి గురించి మూడ్ ఔట్ అయిన త‌ర్వాత గుర్తుకు వ‌స్తుంద‌ని, ఆ త‌ర్వాత తాము అంత‌స‌న్నిహితంగా మెల‌గ‌డం కూడా క‌ష్ట‌మ‌ని వీరు వివ‌రించారు!

ఫెర్మార్మెన్స్ ఎగ్జ‌యిట్ మెంట్!

శృంగారం త‌ర్వాత మ‌రికొంద‌రిలో బాగా మెదిలే ఆలోచ‌న ఇది. ర‌తి క్రీడ‌లో త‌ను స‌మ‌ర్థ‌వంతంగా వ్య‌వ‌హ‌రించామా.. లేదా అనే అమిత‌మైన ఆలోచ‌న‌లు వీరిని కుదిపివేస్తాయ‌ట‌. పార్ట్ న‌ర్ ను సంతృప్తి ప‌రిచిన‌ట్టా.. కాదా.. అనే ఆలోచ‌న‌లు చుట్టుముడ‌తాయ‌ట!