భార్య అందంగా ఉందని పెళ్లి చేసుకుంటాడు, శోభనం కూడా జరిగిపోతుంది. కట్ చేస్తే తెల్లారి స్నానం చేసేటప్పుడు భార్య మేకప్ అంతా పోతుంది. నల్లటి ఓ ఆకృతి బాత్రూమ్ నుంచి బయటకొస్తుంది. అది చూసి భర్త లబోదిబోమంటాడు. ఓ తెలుగు సినిమాలో ఏన్నో ఏళ్ల కిందటే ఈ సీన్ పెట్టారు. ఇప్పుడు ఇదే సీన్ నిజజీవితంలో రిపీట్ అయింది. అమ్మాయి అప్సరసలా ఉందని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి, తీరా అదంతా మేకప్ మహిమ అని తెలుసుకున్నాడు. ఇప్పుడు విడాకులకు అప్లయ్ చేశాడు.
ఈజిస్ట్ లో జరిగింది ఈ ఘటన. పెళ్లయిన 28 రోజులకు ఆ భర్త హెలియోపోలిస్ లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశాడు. తన భార్య నుంచి విడాకులు కావాలని కోరాడు. అతిగా మేకప్ వేసుకొని తన భార్య తనను మోసం చేసిందని, పెళ్లి తర్వాత చూస్తే.. ఆమె రియల్ లుక్స్ కు, మేకప్ తో తీసుకున్న ఫొటోలకు అసలు పొంతన లేదని కోర్టులో వివరించాడు.
తన భార్యను పెళ్లికి ముందు చాలాసార్లు కలిశానని అంగీకరించాడు సదరు భర్త. డేటింగ్ టైమ్ లో ఎన్నోసార్లు రెస్టారెంట్లు, పార్కులు, మాల్స్ లో కలిశామని… అప్పుడు తను చాలా అందంగా ఉందని తెలిపాడు. పెళ్లి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆమె మేకప్ తీసిందని, అప్పుడు ఆమె ముఖాన్ని, జుట్టును తను చూడలేకపోయానని అన్నాడు. తను నిజంగా పెళ్లి చేసుకున్నది, ప్రేమించిన అమ్మాయినేనా అనే అనుమానాన్ని కూడా వ్యక్తంచేశాడు.
అలా 28 రోజుల పాటు మథనపడిన తర్వాత.. సదరు అమ్మాయి తనను మేకప్ తో మోసం చేసిందనే విషయాన్ని గ్రహించానని, కాబట్టి తనకు విడాకులు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు ఆ బాధిత భర్త.
ఇలాంటి ఘటన 2016లోనే ఒకటి వెలుగులోకి వచ్చింది. లండన్ కు చెందిన 28 ఏళ్ల అమ్మాయి, మేకప్ తో తన ప్రియుడ్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది. హనీమూన్ లో భాగంగా ఇద్దరూ కలిసి దుబాయ్ వెళ్లారు. అల్-మంజార్ బీచ్ లో స్నానానికి దిగారు. ఆ కెరటాలకు అమ్మాయి మేకప్ మొత్తం కొట్టుకుపోయి అసలు రూపం బయటపడింది.