న‌య‌న‌తో పెళ్లిపై తేల్చి చెప్పిన విఘ్నేష్‌

అందాల తార, లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌తో పెళ్లెప్పుడనేది ఆమె ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ తేల్చి చెప్పాడు. న‌య‌న‌తార సినిమాల ప‌రంగా ఎంత పాపుల‌ర్ అయ్యారో, ఎఫైర్స్ విష‌యంలోనూ అదే స్థాయిలో వార్త‌ల్లో నిలిచారు. ఇప్ప‌టికీ…

అందాల తార, లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌తో పెళ్లెప్పుడనేది ఆమె ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ తేల్చి చెప్పాడు. న‌య‌న‌తార సినిమాల ప‌రంగా ఎంత పాపుల‌ర్ అయ్యారో, ఎఫైర్స్ విష‌యంలోనూ అదే స్థాయిలో వార్త‌ల్లో నిలిచారు. ఇప్ప‌టికీ ఇద్ద‌రు న‌టుల‌తో పెళ్లి వ‌ర‌కూ వెళ్లి…యూ ట‌ర్న్ తీసుకున్న న‌య‌న‌తార‌పై మీడియాలో ఎన్నెన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇద్ద‌రితో ప్రేమ విఫ‌ల‌మై న‌ప్ప‌టికీ…ఆమెకు ప్రేమ‌తో న‌మ్మ‌కం ఇంకా న‌మ్మ‌కం ఉండ‌డం ఆశ్చ‌ర్య‌మే.

గ‌త కొంత కాలంగా న‌య‌న‌తార‌-విఘ్నేష్ చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరుగుతున్న విష‌యం తెలిసిందే. వాళ్ల‌ద్ద‌రి సాన్నిహిత్యాన్ని చూసి స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌నే ప్ర‌చారం కూడా లేక‌పోలేదు. వాళ్ల‌ద్ద‌రి అన్యోన్యాన్ని చూసిన మీడియా…చాలాసార్లు త‌న‌కు తానే పెళ్లిళ్లు కూడా చేసేసింది. ఈ నేప‌థ్యంలో న‌య‌న‌తార ప్రియుడు విఘ్నేష్ త‌మ పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చాడు.

‘న‌య‌న‌తో నాకు మీడియా  దాదాపు 22 సార్లు  చేసేసింది. పెళ్లి విషయంలో మేము తొందరపడటం లేదు. సినిమాల ప‌రంగా  సాధించాల్సిన ల‌క్ష్యాలు మా ఇద్దరికి ఇంకా చాలా ఉన్నాయి. మాకు డేటింగ్ లైఫ్‌పై బోర్ కొట్టినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటాం. అప్పటి వరకు మేము పెళ్లి గురించి ఆలోచించం’ అంటూ విఘ్నేష్ త‌మ పెళ్లిపై స్ప‌ష్టత ఇచ్చాడు.

డేటింగ్‌పై బోరు కొట్టిన త‌ర్వాతే పెళ్లి అని విఘ్నేష్ స్ప‌ష్టత ఇచ్చాడు. విఘ్నేష్ చెబుతున్న దాని ప్ర‌కారం పెళ్లి కాకుండా చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిర‌గ‌డంలోనే ఆనందం ఉంద‌న్న మాట‌. అదేదో పాట ఉన్న‌ట్టు పెళ్లి మాటే ఎత్త‌కు గురు…సోలో బ‌తుకే సో బెట‌ర్ అన్న‌ట్టు న‌య‌న‌తార‌, విఘ్నేష్ ఆ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు.