థీంతన..థీంతన…సిద్దూ శ్రీరామ్

సిద్దూ శ్రీరామ్ పాట అంటే అదో క్రేజు..అదో మోజు ఇప్పుడు అందరికీ. ఇన్ స్టాంట్ హిట్ అయిపోయేలా మ్యాజిక్ చేసే స్వరం సిద్దూ శ్రీరామ్ ది. ఈ మధ్య కాలంలో కరోనా లాక్ డౌన్…

సిద్దూ శ్రీరామ్ పాట అంటే అదో క్రేజు..అదో మోజు ఇప్పుడు అందరికీ. ఇన్ స్టాంట్ హిట్ అయిపోయేలా మ్యాజిక్ చేసే స్వరం సిద్దూ శ్రీరామ్ ది. ఈ మధ్య కాలంలో కరోనా లాక్ డౌన్ కారణంగా సిద్దూ కొత్త పాట రాలేదు. ఇప్పడు ఆ లోటు పూడుస్తూ వచ్చేసింది సోలో బతుకే సో బెటరు సినిమాలో సిద్దూ పాడిన పాట. థమన్ స్వరకల్పనలో రఘురామ్ రాసిన.. ''…ధీంతన..థీంతన..గుండెల్లో మొదలయ్యిందే…''అంటూ సాగిన పాటను ఆన్ లైన్ లోకి విడుదల చేసారు.

సోలో బతుకే సో బెటరు సినిమా నుంచి వచ్చిన రెండో పాట ఇది. అల వైకుంఠపురములో తరువాత ఫుల్ ఫామ్ లోకి వెళ్లిపోయిన థమన్, అదే సినిమా తరువాత మళ్లీ సిద్దూ తో ట్రయ్ చేసిన పాట కూడా ఇదే.  పాట అయితే ఇన్ స్టాంట్ చార్డ్ బస్టర్ గా లేదు కానీ, వినగా వినగా జనాలకు నచ్చేలాగే వుంది. ముఖ్యంగా థీంతన..థీంతన..అన్న బీట్ హుక్ లైన్ బాగుంది.

విశాఖ బ్యాక్ డ్రాప్ లో పాటకు అందించిన విజువల్స్ బాగున్నాయి. నభా నటేష్, సాయి ధరమ్ తేజ్ లుక్స్, ఎక్స్ ప్రెషన్లు పాటకు యాడెడ్ అడ్వాంటేజ్.