ఆలు లేదు, చూలు లేదు.. హీరోయిన్ పేరు సోనాల్

ఇండస్ట్రీలో కొన్ని గాసిప్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి. అసలుకే దిక్కులేదంటే, కొసరు వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇది కూడా అలాంటిదే. మహేష్-రాజమౌళి సినిమాపై ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. వీళ్ల సినిమా కథేంటి?…

ఇండస్ట్రీలో కొన్ని గాసిప్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి. అసలుకే దిక్కులేదంటే, కొసరు వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇది కూడా అలాంటిదే. మహేష్-రాజమౌళి సినిమాపై ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. వీళ్ల సినిమా కథేంటి? ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది.. లాంటి విషయాలపై గాసిప్స్ వస్తూనే ఉన్నాయి.

ఇంతవరకు ఓకే. ఇప్పుడీ ప్రాజెక్టులో హీరోయిన్ పై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. మహేష్ సినిమాలో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారట. ఇదీ ఇప్పుడు వైరల్ అవుతున్న పుకారు. సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వకుండానే, మహేష్ కు ఫుల్ నెరేషన్ ఇవ్వకుండానే, కొంతమంది ఇలా హీరోయిన్ పేరును ఫైనలైజ్ చేసేశారు. అదే కామెడీ.

పోనీ.. ఆ హీరోయిన్ గా ఎవరైనా స్టార్ హీరోయిన్ పేరును ప్రచారంలోకి తెస్తే అదో లెక్క. పోనీలే అనుకోవచ్చు. సోనాల్ చౌహాన్ లాంటి ఫ్లాప్ హీరోయిన్ ను తెరపైకి తీసుకొచ్చి, ఏకంగా మహేష్-రాజమౌళి సినిమాలో హీరోయిన్ ను చేసేశారు.

తెలుగులో సోనాల్ చౌహాన్ కు పెద్దగా పాపులారిటీ లేదు. ఆమె చేసిన సినిమాల్లో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ. ఆమె నటించిన ది ఘోస్ట్ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అలాంటి హీరోయిన్ ను ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో కూడా తెలియని మహేష్ మూవీలో హీరోయిన్ గా కన్ ఫర్మ్ చేసేశారు కొంతమంది.