భోళా, గాండీవధారి ప్రభావం గుడుంబాపై పడిందా?

పవన్ సినిమాలు డైరక్ట్ రిలీజ్ లోనే కాదు, రీ-రిలీజ్ లో కూడా ట్రెండ్ సృష్టిస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఖుషి సినిమా. ఖుషి సినిమాను రిలీజ్ చేసినప్పుడు ఓ స్ట్రయిట్ రిలీజ్ కు జరిగినంత…

పవన్ సినిమాలు డైరక్ట్ రిలీజ్ లోనే కాదు, రీ-రిలీజ్ లో కూడా ట్రెండ్ సృష్టిస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఖుషి సినిమా. ఖుషి సినిమాను రిలీజ్ చేసినప్పుడు ఓ స్ట్రయిట్ రిలీజ్ కు జరిగినంత హంగామా జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా జోరు కనిపించింది. ఆ తర్వాత మళ్లీ అంత సందడి తొలిప్రేమ విషయంలో కనిపించింది.

అయితే ఇదంతా భోళాశంకర్, గాండీవరధారి అర్జున సినిమాలు రిలీజ్ అవ్వకముందు సంగతి. ఈ రెండు సినిమాలు వచ్చిన తర్వాత మెగా హీరోల ప్రాజెక్టులపై ఆడియన్స్ కు ఆసక్తి తగ్గినట్టు కనిపిస్తోంది. దీనికి సరైన ఉదాహరణగా నిలిచింది గుడుంబా శంకర్ రీ-రిలీజ్

ఈ సినిమా ఫ్లాప్ మూవీనే కావొచ్చు. కానీ పవన్ ఫ్యాన్స్ లో, ఓ సెక్షన్ ఆడియన్స్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. పైగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు నాడు వస్తున్న సినిమా ఇది. కాబట్టి ఆటోమేటిగ్గా టికెట్ సేల్స్ అదిరిపోతాయని అంతా ఊహించారు. కానీ అలా జరగలేదు.

ఖుషి, తొలిప్రేమ సినిమాలతో పోలిస్తే, గుడుంబా శంకర్ మూవీని చాలా తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమాకు పెద్దగా బుకింగ్స్ కనిపించడం లేదు. 2-3 మెయిన్ సెంటర్స్ మినహా, మిగతా అన్ని సెంటర్లలో గుడుంబా శంకర్ పై ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పవన్ బర్త్ డే స్పెషల్ అనే ఫ్యాక్టర్ కూడా ఈ సినిమాకు కలిసిరాకపోవడం విచిత్రం.

రీసెంట్ గా మెగా కాంపౌండ్ నుంచి వరుసగా ఫ్లాపులొస్తున్నాయి. భోళాశంకర్ రూపంలో అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చారు చిరంజీవి. ఇక గాండీవధారి అర్జున రూపంలో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు వరుణ్ తేజ్. ఈ రెండు సినిమాల దెబ్బతో మరో మెగా హీరో సినిమా చూడాలంటే ఆడియన్స్ భయపడుతున్నట్టున్నారు. ఆ ప్రభావం గుడుంబా శంకర్ పై పడినట్టుంది.