ఆర్జీవీ జోరు మామూలుగా లేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ నాటి కన్నా పదింతలు ఎక్కువైంది. మరో రెండు రోజుల్లో వదులుతున్నా అంటూ ఓ పాట టీజర్ ను ఆన్ లైన్ లోకి వదిలాడు. ఎప్పుడో వచ్చిన, 'చుక్కలాంటి అమ్మాయి..చక్కనైన అబ్బాయి' పాట స్టయిల్ ను తీసుకుని,
''..తాతగారి సైకిల్ నువ్వు లాక్కుని తొక్కతున్నాయి. నన్ను కూడా తొక్కమంటున్నావు. నాకు అంత సరదా లేదుగానీ నన్ను వదిలేయ్. నేను ఫారిన్ వెళ్లిపోతా..నా జల్సా చేసుకుంటాను. పచ్చనైన మా డాడీ చెబుతున్నాను ముద్దాడి.''
అంటూ సాగే పాట టీజర్ ను విడుదల చేసారు వర్మ. మరో రెండు రోజుల్లో ఫుల్ సాంగ్ వదులుతారంట. ఇప్పటికే రెండు మూడు పాటలు వదిలారు. ఇప్పుడు ఇది మరోటి.
ఇప్పటి వరకు ఇటీవల ఆర్జీవీ తీసిన సినిమాలకు దీనికి తేడా ఏమిటంటే, చాలా మంది సీనియర్ తెలుగు నటులు కూడా నటించడం. బ్రహ్మోనందం, పృధ్వీ, ఆలీ ఇలా పలువురు వున్నారు.
ఆంధ్రలో గవర్నమెంట్ మారడంతో, నటించడానికి జనం ముందుకు వస్తున్నట్లున్నారు. అంతకు ముందు బాబు ప్రభుత్వం వుండగా ఎవ్వరూ ముందుకు రాలేదు. వైఎస్ బయోపిక్ యాత్ర కోసం పరభాషా నటులను వెదుక్కోవలసి వచ్చింది.