ఒక్క హిట్‌తో మళ్లీ బంపర్‌ క్రేజ్‌

తమిళ సినిమా మార్కెట్‌ పడిపోవడంతో పాటు కార్తీకి కూడా ఫ్లాప్స్‌ రావడంతో తెలుగునాట అతని సినిమాలకి గిరాకీ పడిపోయింది. అందుకే కార్తీ 'ఖైదీ' చిత్రాన్ని చాలా తక్కువ రేటుకి కొన్నారు… అది కూడా అడ్వాన్స్‌…

తమిళ సినిమా మార్కెట్‌ పడిపోవడంతో పాటు కార్తీకి కూడా ఫ్లాప్స్‌ రావడంతో తెలుగునాట అతని సినిమాలకి గిరాకీ పడిపోయింది. అందుకే కార్తీ 'ఖైదీ' చిత్రాన్ని చాలా తక్కువ రేటుకి కొన్నారు… అది కూడా అడ్వాన్స్‌ పద్ధతిలో.

అయితే ఖైదీ మంచి హిట్‌ అయి కొన్నవారికి మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో మళ్లీ కార్తీ చిత్రాలకి డిమాండ్‌ ఏర్పడుతోంది. అతని మలి చిత్రం ఇంతవరకు మొదలు కాలేదు కానీ కార్తీ తదుపరి చిత్రం ఇక్కడ మంచి ధర పలకడం గ్యారెంటీ.

తన వదిన జ్యోతికతో కలిసి తంబి అనే చిత్రాన్ని కార్తీ చేయబోతున్నాడు. ఇందులో జ్యోతిక తమ్ముడిగా కార్తీ కనిపిస్తాడు. మలయాళంలో ఘన విజయం సాధించి, దాదాపు అన్ని ముఖ్య భారతీయ భాషలలోకి రీమేక్‌ అయిన 'దృశ్యం' దర్శకుడు జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో కార్తీ పాత్ర 'ఊపిరి'లో అతను చేసిన పాత్రకి దగ్గరగా వుంటుందట.

జీతు జోసెఫ్‌ చిత్రాలంటే కొత్తగానే వుంటాయి కనుక కార్తీ మరోసారి మంచి ప్రాజెక్ట్‌ సెట్‌ చేసుకున్నట్టే కనిపిస్తోంది. జ్యోతిక కాంబినేషన్‌లో చేయడం తమిళనాట చాలా ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకుంటుంది.

ఇకపై కమర్షియల్‌ చిత్రాలేవీ చేయకుండా ఖైదీ లాంటి కాన్సెప్ట్‌ సినిమాలకే కట్టుబడి వుండాలని నిర్ణయించుకున్నాడు కార్తీ.