అల్లు అర్జున్‌కి కాస్త గ్యాప్ అనుకోకుండా వచ్చింది కానీ ఈసారి మాత్రం బలంగా కొట్టేలానే వస్తున్నాడనే నమ్మకాన్ని ఆల్రెడీ రెండు పాటలతో కలిగించేసాడు.
అల వైకుంఠపురములోతో మరోసారి త్రివిక్రమ్‌తో జత కట్టిన అల్లు అర్జున్ తదుపరి చిత్రాన్ని సుకుమార్‌తో చేస్తున్నాడు. ఎప్పటిలా టాలెంటెడ్ దర్శకుల చేతికే తన సినిమాలు అప్పగిస్తూ 'నా పేరు సూర్య'తో చేసిన తప్పుని రిపీట్ చేయడం లేదు.
అల్లు అర్జున్ ట్రాక్ మీదకి వచ్చేసాడు కానీ నిర్మాతలకే కాస్త మింగుడు పడడం లేదు. ఇదివరకు ఏ బ్యానర్‌లో సినిమా చేస్తే ఆ నిర్మాతకి స్వేఛ్ఛనిచ్చేసిన బన్నీ ఇప్పుడు తను నటించే ప్రతి సినిమాకీ గీతా ఆర్ట్స్‌కి వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.
త్రివిక్రమ్ కారణంగా హారిక హాసిని సంస్థ ఎక్కువ రాద్ధాంతం చేయకుండానే ఆ కండిషన్‌కి ఓకే చెప్పేయగా, తాజాగా మైత్రి మూవీస్ ముందు కూడా అదే ప్రతిపాదన పెట్టాడట.
ఈ చిత్రంలో గీతా ఆర్ట్స్‌కి భాగస్వామ్యం కావాలని అల్లు అర్జున్ పెడుతోన్న కండిషన్‌కి మైత్రి ఒప్పుకున్నదీ లేనిదీ ఇంకా తెలీదు.
అయితే వరుస పరాజయాలతో కష్టాల్లో వున్న బ్యానర్‌కి చాలా గ్యాప్ తర్వాత చేస్తోన్న పెద్ద సినిమా ఇలా ప్రాఫిట్ షేరింగ్ అంటే ఇబ్బందే కానీ ఇకపై తన సినిమాలన్నిటికీ గీతా ఆర్ట్స్ పార్టనర్‌గా వుండాలనేది బన్నీ పెట్టిన రూలు.