cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇదో మినీ త్రివిక్రమ్‌ - పవన్‌ కాంబినేషన్‌!

ఇదో మినీ త్రివిక్రమ్‌ - పవన్‌ కాంబినేషన్‌!

భీష్మ చిత్రం టీజర్‌ చూడగానే పవన్‌కళ్యాణ్‌ 'ఖుషీ'లోని నడుము సీన్‌ గుర్తు రాక పోదు. భీష్మ చిత్రానికి ఫస్ట్‌ లుక్కే ఈ పోస్టర్‌గా రిలీజ్‌ చేసారు.

పవన్‌కళ్యాణ్‌ వీరాభిమాని అయిన నితిన్‌ కావాలనే ఇలా ఫాన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేసాడనుకోవచ్చు. ఇకపోతే ఈ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల. అతను శిష్యరికం చేసింది త్రివిక్రమ్‌ దగ్గర.

త్రివిక్రమ్‌ మాదిరిగానే పదాలతో పంచ్‌లు పేల్చే ఇతను 'భీష్మ' చిత్రాన్ని ఒక చిన్న త్రివిక్రమ్‌, ఒక చిన్న పవన్‌ కళ్యాణ్‌తో తీస్తే ఎలాగుంటుందో అంత సరదాగా మలుస్తున్నాడట.

ఈ ఏడాదిలో రిలీజ్‌ లేకపోయినా కానీ వచ్చే యేడాది భీష్మతో బ్రహ్మాండంగా మొదలవుతుందనే నమ్మకంతో వున్నాడు నితిన్‌.

ఈ చిత్రంలో ప్రస్తుతం యమ క్రేజ్‌ మీద వున్న రష్మిక హీరోయిన్‌ కావడం దీనికి మరో ప్లస్‌ పాయింటు. మహేష్‌తో ఆమె నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు రిలీజ్‌ అయిన తర్వాత వస్తుంది కనుక భీష్మకి రష్మిక ఇంకా పెద్ద ఎస్సెట్టు. అందుకే టైటిల్‌లో హీరో మాత్రమే వున్నా కానీ ప్రచారంలో హీరోయిన్‌కి సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు.

ఈ చిత్రం ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో నితిన్‌ రిజల్ట్‌ వరకు ఆగకుండా అప్పుడే రంగ్‌దే అంటూ మరో చిత్రాన్ని కూడా మొదలు పెట్టేసాడు.